ఫ్లెక్సీలు తెచ్చిన తంటాలు.. ట్రాఫిక్ సిగ్న‌ల్స్ క‌న‌ప‌డ‌క అవ‌స్థ‌లు

హైద‌రాబాద్‌లో మామూలుగానే ఓ రేంజ్‌లో ట్రాఫిక్ జామ్ అనేది ఉంటుంది.మ‌హా న‌గ‌రంగా పేరు గ‌ణించిన భాగ్య‌న‌గ‌రంలో ట్రాఫిక్ స‌మ‌స్య‌లు తీర్చేందుకు ఇప్ప‌టికే చాలానే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు అధికారులు.

అయితే ఒకానొక స‌మ‌యంలో కేటీఆర్ మాట్లాడుతూ హైద‌రాబాద్ స్వ‌చ్ఛ‌త కోసం ఎవ‌రూ కూడా ఫ్లెక్సీల‌ను ఏర్పాటు చేయొద్దంటూ వ్యాఖ్యానించారు.

త‌మ పార్టీ వారికి చెందిన‌వి కూడా చింపేయాల‌ని, త‌న ఫొటో ఉన్నా లేదా కేసీఆర్ ఫొటో ఉన్నా స‌రే దాన్ని చూడ‌కుండా చించేయాలంటూ పిలుపునిచ్చారు.

కానీ నిన్న టీఆర్ఎస్ ప్లీన‌రీ స‌మావేశం నిర్వ‌హించ‌గా దీనికి పెద్ద ఎత్తున ఫ్లెక్సీల‌ను ఏర్పాటు చేశారు పార్టీ కార్య‌క‌ర్త‌లు.

దాదాపు టీఆర్ ఎస్ పార్టీ ఏర్ప‌డి 20 ఏండ్లు గ‌డుస్తున్న సంద‌ర్భంగా ప్లీన‌రీ స‌మావేశాన్ని స‌పెద్ద ఎత్తున నిర్వ‌హించ‌గా ఇందుకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సెటైర్లు వ‌స్తున్నాయి.

న‌గ‌రంలో ఎటు చూసినా స‌రే గులాబీ రంగులో ఉండే ఫ్లెక్సీలే క‌నిపిస్తున్నాయి.దీంతో అధికారంలో ఉన్న పార్టీకి రూల్స్ వ‌ర్తించవా అంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

"""/"/ ఇంకొన్ని చోట్ల అయితే ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా కనిపించకుండా భారీ ఎత్తున ప్లెక్సీలు అరేంజ్ చేయ‌డంతో అస‌లు ట్రాఫిక్ ఉందో లేదో తెలియ‌క వాహ‌న‌దారులు చాలా ఇబ్బందులు పడ్డారు.

సాధార‌ణ ప‌బ్లిక్ ప్లెక్సీలు పెడితే లక్షల్లో ఫైన్స్ వేసే ఆఫీస‌ర్లు టీఆర్ఎస్ పార్టీ ఇంత పెద్ద ఎత్తున ఏకంగా ట్రాఫిక్ సిగ్న‌ల్స్ క‌నిపించ‌కుండా పెట్టిన‌ప్పుడు ఏం చేస్తున్నారంటూ మండిప‌డుతున్నారు నెటిజ‌న్లు.

వెంట‌నే వాటిని తొల‌గించాలంటూ కోరుతున్నారు.ఇంకొంద‌రు అయితే కేటీఆర్ గ‌తంలో చేసిన కామెంట్ల‌ను గుర్తు చేస్తూ విమ‌ర్శిస్తున్నారు.

ఫ్లెక్సీలు వ‌ద్ద‌న్న కేటీఆర్ ఇప్పుడు త‌మ పార్టీకి ఇలా ఫ్లెక్సీలు పెట్టుకోవ‌డం ఏంటంటూ తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

Tollywood Hit Movies : కేవలం ఆ ఒక్క కారణంగానే సూపర్ డూపర్ హిట్టైన టాలీవుడ్ సినిమాలు !