వైట్ హెడ్స్ తో ఇబ్బంది పడుతున్నారా... అయితే ఈ పాక్స్ మీ కోసమే
TeluguStop.com

చర్మ గ్రంధులలో మృత కణాలు, నూనె ఎక్కువగా ఉన్నప్పుడు సన్నని, తెల్లని గుండ్రని పొక్కులు ఏర్పడుతూ ఉంటాయి.


ఈ సమస్య అన్ని చర్మ తత్వాల వారికి వస్తుంది.ఈ సమస్య పరిష్కరానికి ఖరీదైన కాస్మొటిక్స్ వాడవలసిన అవసరం లేదు.


మన ఇంటిలో అందుబాటులో ఉండే సహజ సిద్ధమైన పదార్ధాలతో సులభంగా తగ్గించుకోవచ్చు.ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.
రెండు స్పూన్ల పెరుగులో ఒక స్పూన్ ఓట్ మీల్ కలిపి ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేయాలి.
ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం కనపడుతుంది.
ఈ కాంబినేషన్ మీ చర్మంపై చేరిన మురికిని బయటకిలాగి, వైట్ హెడ్స్ ను కూడా తొలగిస్తుంది.
ఒక స్పూన్ టమోటా రసంలో అర స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఈ విధంగా వారంలో ఒకసారి చేస్తూ ఉంటే వైట్ హెడ్స్ సమస్య తొలగిపోతుంది.
టమోటా,నిమ్మరసంలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండుట వలన వైట్ హెడ్స్ ని తొలగించటంలో చాలా సమర్ధ వంతంగా పనిచేస్తుంది.
అరస్పూన్ శనగపిండిలో ఒక స్పూన్ గ్రీన్ టీ కలిపి ముఖానికి పట్టించి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే మంచి ఫలితం కనపడుతుంది.చర్మంలోని విషపదార్థాలను, కలుషితాలను తొలగించి, వైట్ హెడ్స్ ను సమూలంగా తొలగిస్తుంది.
రోజూ ఏ టైమ్‌కి పడుకోవాలి.. ఆలస్యంగా నిద్రిస్తే నష్టాలేంటి..?