థైరాయిడ్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా..?! అయితే ఇలా ట్రై చేయండి ఉపశమనం పొందండి..!
TeluguStop.com
మన శరీరం థైరాయిడ్ హార్మోన్లను కావాల్సినంత ఉత్పత్తి చేయనప్పుడు హైపోథైరాయిడిజం అనే వ్యాధి రావడం జరుగుతుంది.
ఈ హార్మోన్ మానవ శరీర పెరుగుదల, జీవక్రియలు మరియు అంతర్గత రోగనిరోధకతలో సైతం కీలక పాత్ర పోషిస్తుంది.
అందువల్ల, థైరాయిడ్ లోపం ఉన్నవారికి శరీరంలోని అదనపు బరువు తగ్గించుకోవడం చాలా కష్టం అవుతుంది.
కొన్ని సందర్భాల్లో, అంతర్లీన థైరాయిడ్ సమస్యలు కూడా దేహంలోని కొవ్వు పెరగడానికి తద్వారా శరీర బరువు వేగంగా పెరగడానికి కారణంగా మారతాయి.
అందువల్ల, నిపుణులు సైతం బరువు తగ్గించుకోవాలనుకునే వారికి తరచుగా సలహా ఇచ్చేది థైరాయిడ్ గురించే.
అంతర్లీనంగా థైరాయిడ్ సమస్య ఉన్నవారికి, శరీరంలో జీవక్రియలు జరిగే పనితీరు బలహీనపడుతుంది.మన జీవక్రియ వ్యవస్థ అనేది శరీర పనితీరును ప్రభావితం చేయడంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది.
అంతేకాక వివిధ జీవక్రియల్లో భాగంగా తీసుకున్న ఆహారంలోని కేలరీలను కరిగించే విధానాన్ని సైతం ప్రభావితం చేస్తుంది.
అందువల్ల మీకు కూడా జీవక్రియల్లో సమస్యలు ఉన్నాయని అనిపించినా, లేదా నెమ్మదిగా జీవక్రియ రేటు ఉంటున్నా, మీ శరీర బరువు పెరుగుతుంది.
దేహంలోని అదనపు బరువును తగ్గించుకోవడం మీకు కష్టతరమవుతుంది.నెమ్మదిగా జరిగే జీవక్రియల కారణంగా రక్తపోటు మరియు కొలెస్ట్రాల్, ఉదరంలో సమస్యలు రావడంతో పాటు అదనపు ఆరోగ్య ప్రమాదాలు కూడా వచ్చే అవకాశముంది.
అందువల్ల, ఆరోగ్యకరమైన జీవితం కోసం ఆహారాన్ని సమతుల్యం చేసుకోవడం, థైరాయిడ్ సమస్యలను సరిదిద్దుకోవడం చాలా అవసరం.
ఒక గ్లాస్ లో పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ లో సగం మిరియాల పొడి వేసి వేడి నీటిని పోసి దానిలో అరస్పూన్ కొబ్బరి నూనె కలిపి ప్రతి రోజు తాగితే థైరాయిడ్ సమస్య నుండి బయట పడవచ్చని నిపుణులు, వైద్యులు సూచిస్తున్నారు.
రష్మిక సెలక్షన్ వేరే లెవెల్… రిజెక్ట్ చేసిన మూడు సినిమాలు డిజాస్టర్… లక్ అంటే ఇదే మరీ!