దగ్గు, జలుబు తో ఇబ్బంది పడుతున్నారా..? అయితే మీ ఆహారం లో ఇవి చేర్చుకోండి…!
TeluguStop.com
ప్రస్తుతం వర్షాకాలం, రాబోయేది చలికాలం.ఈ సమయంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక వైరస్ కారణంగా జలుబు, దగ్గు జ్వరం లాంటి వాటితో బాధపడుతున్నారు.
ఇకపోతే ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో ఈ జలుబు, దగ్గు, జ్వరం లాంటి వ్యాధులు పరిపాటిగా మారి పోతున్నాయి.
ఈ మూడింటికి మెడికల్ షాపుల్లో విరివిరిగా మాత్రలు లభిస్తాయి కానీ, మెడికల్ స్టోర్ కు వెళ్లకుండానే ఇంట్లో దొరికే వాటితోనే వీటిని నయం చేసుకోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.
అయితే అవి ఏమిటో ఒకసారి చూద్దామా.ముందుగా పసుపు, పాలు కలుపుకుని కాస్త వేడి చేసుకొని ఆహారం తిన్న తర్వాత వీటిని కూడా ఓ గ్లాస్ నిండా తాగడం ద్వారా జలుబు, దగ్గు నుండి ఉపశమనం పొందవచ్చు.
ఇక ఆ తర్వాత తృణధాన్యాలను మన ఆహారంలో విరివిరిగా చేర్చుకోవాలి.ఇలా చేర్చుకోవడం ద్వారా శరీరం వెచ్చగా ఉంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
తృణధాన్యాల విషయానికొస్తే ఓట్స్, బ్రౌన్ రైస్ లాంటివి తీసుకోవడం ద్వారా మన శరీరంలోని వేడిని చాలావరకు తగ్గించడమే కాకుండా, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
"""/" /
వీటితో పాటు మన ఆహారంలో తేన, వాము, తులసి ఆకులు, కోడిగుడ్లు, వెల్లుల్లి, ఏవైనా కూరగాయలకు సంబంధించి సూప్స్ తీసుకోవడం ద్వారా శరీరంలోకి రోగనిరోధకశక్తిని కొద్ది వరకు పెంచుకోవచ్చు.
అంతేకాకుండా మీ శరీరంలో ఎప్పుడైతే దగ్గు, జలుబు, జ్వరం మొదలు అవుతుందేమో అని సూచనలు కనిపిస్తే ఆ రోజు నుండి ప్రతి రోజు ఉదయం పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఆవిరిని పెట్టుకోవాలి.
నీళ్లను ఉడికించే సమయంలో అందులో కాస్త పసుపు, జండుబాం లేదా ఏదైనా నా ఫీలింగ్ టాబ్లెట్లు వేసుకొని ఆవిరి పట్టుకుంటే శ్వాసకోశ సంబంధ వ్యాధులు ఏదైనా ఇబ్బందులు ఉంటే పూర్తిగా తొలగిపోతాయి.
ఈ విదేశీ మహిళకు బుద్ధి లేదు.. కిరణ్ బేడీ వత్తాసు పలకడమే దారుణం?