శీతాకాలంలో కఫంతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ టీ తో చెక్ పెట్టండి..!

సాధారణంగా శీతాకాలంలో జలుబు( Cold ) వల్ల చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటారు.

అలాగే చాలా మందికి పొగ మంచు కారణంగా దగ్గు, ముగ్గు దిబ్బడ లాంటి సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి.

అందులోనూ ఉబసం ఉన్నవారికి అయితే కఫం అనేది బాగా పడుతుంది.దీంతో తినేందుకు, తాగేందుకు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు.

ఈ కఫాన్ని దూరం చేసుకోవడానికి లవంగాలు ఎంతగానో ఉపయోగపడతాయి.శీతాకాలంలో వచ్చే శ్వాస సమస్యలకు లవంగాలు( Cloves ) ఎంతో బాగా ఉపయోగపడతాయి.

మందులు ఉపయోగిస్తే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి.ఆయుర్వేదంలో లవంగాలను అనారోగ్య సమస్యలను తగ్గించే ఔషధాలుగా ఉపయోగిస్తారు.

"""/" / ముఖ్యంగా చెప్పాలంటే లవంగాల తో తయారు చేసిన టీ తాగడం వల్ల కఫాన్ని దూరం చేసుకోవచ్చు.

ముందుగా ఒక గిన్నెలో రెండు కప్పుల నీళ్లు తీసుకొని, దీన్ని స్టవ్ మీద పెట్టి బాగా మరిగించాలి.

ఇప్పుడు చిన్న అల్లం ముక్క, దాల్చిన చెక్క ఒకటీ,మూడు లవంగాలు వేసి బాగా మరిగించుకోవాలి.

ఇవి బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వడగట్టి ఒక గ్లాసులోకి తీసుకొని అందులో కాస్త తేనె కలుపుకొని తాగాలి.

అలాగే ఈ పానీయానికి కఫన్నీ విరిచే శక్తి ఉంటుంది.దీని తాగడం వల్ల కఫం అంతా బయటకు వచ్చేస్తుంది.

ఈ లవంగాలలో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. """/" / దీంతో జలుబు, దగ్గు, జ్వరం అనేవి తగ్గిపోతాయి.

అలాగే సైనస్ తో బాధపడేవారు కూడా లవంగాల టీని( Clove Tea ) క్రమం తప్పకుండా తాగడం వల్ల ఉపశమనం లభిస్తుంది.

టీ తాగినప్పుడు కాకర కాయలతో చేసిన వంటకాలు ఎక్కువగా తినాలి.ఎందుకంటే కాకరకాయలకు కూడా కఫాన్ని విరిచే శక్తి ఉంటుంది.

ఈ లవంగాల టీ తాగడం వల్ల వికారం, అజీర్తి, వాంతులు వంటివి కూడా రాకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

ఈ స్టార్ యాక్టర్స్ ఆ సినిమాల కోసం పనిచేసిన డబ్బులు తీసుకోలేదు.. ఎందుకంటే…??