టీడీపీ – జనసేన ప్రభుత్వం వస్తే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు కష్టాలు తప్పవా..?
TeluguStop.com
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం ఎంత హీట్ వాతావరణం లో కొనసాగుతూన్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
ఒక పక్క టీడీపీ( TDP ) మరియు జనసేన పార్టీ( Janasena ) కలిసి పోటీ చెయ్యబోతున్నాయి అనేది అధికారికంగా ఖరారు కావడం, దాని తర్వాత రాష్ట్రం లో జరిగిన పరిణామాల దృష్ట్యా ప్రభుత్వం ఎత్తులు పై ఎత్తులు వెయ్యడం వంటివి జరుగుతున్నాయి.
ఇక మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ జాతీయ అద్యక్ష్యుడు నారా చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) అరెస్ట్ అవ్వడం, ఆ తర్వాత తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు మరియు నాయకులూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చెయ్యడం వంటివి జరుగుతూ ఉన్నాయి.
ఇదంతా పక్కన పెడితే సొంత మామయ్య అరెస్ట్ అయితే జూనియర్ ఎన్టీఆర్ కనీసం ఇప్పటి వరకు స్పందించకపోవడం పెద్ద చర్చనీయాంశం గా మారింది.
సొంత అభిమానులే జూనియర్ ఎన్టీఆర్ ని తిడుతున్నారు.ఇక తెలుగు దేశం పార్టీ కార్యకర్తల గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
"""/" /
కొంతమంది తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు అయితే సోషల్ మీడియాలో టీడీపీ మరియు జనసేన పార్టీల ప్రభుత్వం వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) సినిమాలను మాకు ఇష్టమొచ్చినట్టు తొక్కేస్తాము అంటూ వార్నింగ్ లు ఇస్తున్నారు.
గడిచిన నాలుగేళ్ల నుండి వైసీపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సినిమాలను ఏ రేంజ్ లో ఆనించివేస్తుందో మన కళ్ళతో చూస్తూనే ఉన్నాం.
'వకీల్ సాబ్ ' సినిమా విడుదల సమయం లో అప్పటికప్పుడు అర్థ రాత్రి జీవో ని జారీ చేసి, మరో మూడు గంటల్లో ప్రారంభం అయ్యే బెన్ఫిట్ షోస్ మొత్తాన్ని పూర్తిగా ఆపించేసి, ఆ సినిమాకి సుమారుగా పది కోట్ల రూపాయిల నష్టాలను వాటిల్లేలాగా చేసారు.
ఇక ఆ తర్వాత వచ్చిన 'భీమ్లా నాయక్' సంగతి సరేసరి.MRO లు , పోలీసులు అందరిని థియేటర్స్ చుట్టూ తిప్పింది వైసీపీ ప్రభుత్వం.
ఈ సినిమాకి టికెట్ రేట్స్ లేవు, అలాగే బెన్ఫిట్ షోస్ లేవు. """/" /
అందువల్ల 'భీమ్లా నాయక్' ( Bheemla Nayak ) సినిమాకి అదనంగా రావాల్సిన 30 కోట్ల రూపాయిల షేర్ ఆగిపోయింది.
ఇలాంటి పరిస్థితే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు జరిగే అవకాశం ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
కానీ చంద్రబాబు నాయుడు ఇలా కక్ష సాధింపు రాజకీయాలు అయితే ఇప్పటి వరకు చెయ్యలేదు.
ఆయన తల్చుకుంటే ముఖ్యమంత్రి గా ఉన్న సమయం జగన్ ని చాలా తేలికగా జైలులో వేసి ఉండొచ్చు, కానీ అలా జరగలేదు.
జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటి నుండో టీడీపీ కి దూరం గా ఉన్నాడు, చంద్ర బాబు తల్చుకుంటే ఇలాంటి కక్ష సాధింపులు చేసి ఆయన సినిమాలను ఆపేసి ఉండొచ్చు, అది కూడా జరగలేదు.
కాబట్టి ప్రశాంతంగా ఉండండి అంటూ కొంతమంది సీనియర్ టీడీపీ నాయకులూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి భరోసా ఇస్తున్నారు.
విమానంలాంటి అద్భుతమైన కారును కొనుగోలు చేసిన విజయ్.. ఈ కారు ప్రత్యేకతలివే!