అయ్యయ్యో అంత మేకప్ వద్దమ్మా.. యాంకర్ అనసూయ వీడియోపై ట్రోల్స్!

బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఈమె జబర్దస్త్ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా వెండితెర పై పలు సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

ఇదిలా ఉండగా వెండితెరపై లేడి ఓరియెంటెడ్ చిత్రాలలో నటించినా రాని గుర్తింపు ఈమెకు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం సినిమాలోని పాత్ర ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్నారని చెప్పవచ్చు.

రంగమ్మత్త పాత్రలో నటించిన అనసూయ ఇకపై వెనక్కి తిరిగి చూసుకోలేదు ఇలా సినిమా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారు.

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక ఫోటో వీడియో ద్వారా అభిమానులను సందడి చేసే అనసూయ కొన్నిసార్లు దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కొంటారు.

ఇలా ఎంతో మంది ఈమె వస్త్రధారణ గురించి కామెంట్ చేస్తున్న ఏ మాత్రం తగ్గకుండా ఇన్స్టాగ్రామ్ వేదికగా తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.

"""/" / ఇప్పటికే ఈ విధంగా ఎన్నో ఫోటోలను షేర్ చేసిన ఈమె తన గురించి నెగిటివ్ కామెంట్లు చేసిన వారికి ఘాటుగా సమాధానం చెబుతూ దూసుకుపోతున్నారు.

ఇదిలా ఉండగా అనసూయ తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా మరొక వీడియోని షేర్ చేశారు అయితే ఇందులో స్లీవ్ లెస్ టాప్, స్కిన్ టైట్ జీన్స్ వేసుకున్న అనసూయ చాలా ఓవర్ గా మేకప్ వేసుకున్నారు.

ఈ క్రమంలోనే ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.

ఇక ఈ వీడియో షేర్ చేసిన కొన్ని క్షణాలకే సోషల్ మీడియాలో పెద్దఎత్తున కామెంట్స్ వచ్చాయి.

ఈ వీడియో చూసిన ఎంతోమంది నెటిజన్లు అసలు ఇక్కడ అనసూయనేనా అంటూ కామెంట్లు చేయగా మరికొందరు కాస్త మేకప్ ఓవర్ అయింది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

అదేవిధంగా మరికొందరు మాత్రం అయ్యో వద్దమ్మా.సుఖీభవ అనే డైలాగ్ ను అనసూయపై ఉపయోగిస్తూ అయ్యయ్యో అంత మేకప్ వద్దమ్మా.

అనసూయ అంటూ కామెంట్ చేస్తున్నారు.మొత్తానికి అనసూయ షేర్ చేసిన ఈ వీడియో క్షణాల్లో వైరల్ గా మారింది.

నిజంగానే అనసూయ ఈ వీడియోలో కాస్త ఓవర్ గా మేకప్ వేసుకోవడం విశేషం.

ఇక ఈమె సినిమాల విషయానికొస్తే తాజాగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో దాక్షాయని పాత్ర ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

అయితే ఈ పాత్ర ద్వారా ప్రేక్షకులను పెద్దగా సందడి చేయలేకపోయినా పార్ట్ 2 లో ఈమె పాత్ర ఎంతో హైలెట్ గా ఉండనుందని తెలుస్తోంది.

"""/" / అదే విధంగా రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ నటించిన చిత్రం ఖిలాడి సినిమాలో కూడా అనసూయ కీలక పాత్రలో నటించింది ప్రస్తుతం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ స్పందన దక్కించుకుంది.

మొత్తానికి అనసూయ వరుస సినిమాప్రాజెక్టులతో ఎంతో బిజీగా గడపడమే కాకుండా సోషల్ మీడియా వేదికగా ఎన్నో ఫోటోలు వీడియోలను షేర్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారని చెప్పవచ్చు.

యూఎఫ్‌సీ వద్ద డొనాల్డ్ ట్రంప్‌కు ఘనస్వాగతం .. కోర్టు దోషిగా తేల్చినా ఈ స్థాయిలో క్రేజా