ఏంటి సుకుమార్ ఇది.. నీకు నిజంగా ఇష్టమైన హీరో ఎవరో చెప్పు?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ లెక్కల మాస్టర్ అయిన సుకుమార్ గురించి మనందరికీ తెలిసిందే.

అయితే సుకుమార్ లెక్కలు, అంచనాలు ఎప్పుడు తప్పుకావు అని అంటూ ఉంటారు.అదేవిధంగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సినీమాలు ఇప్పటివరకు బెడిసి కొట్టింది లేదు.

ఇక అభిమానులు సుకుమార్ ని క్రియేటివ్ డైరెక్టర్ అని అభిమానంగా పిలుచుకుంటారు అన్న విషయం తెలిసిందే.

ఇకపోతే తాజాగా పుష్ప సినిమాతో సూపర్ హిట్ టాక్ ను అందుకొని పుష్ప 2 షూటింగ్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.

కాగా ఈ మధ్య కాలంలో సుకుమార్ ప్రతి సినిమా ఫంక్షన్స్‌కి ముఖ్య అతిథి స్థానంలో ఎక్కువగా హాజరవుతున్నారు.

ఇంతవరకు బాగానే ఉన్నప్పటికి ఏ సినిమా ఫంక్షన్‌కి వెళితే, ఆ సినిమా హీరోకి వీరాభిమానిని అంటున్నారు సుకుమార్.

అయితే బాగాలేదని కొందరు సుకుమార్ అభిమానుల అభిప్రాయ పడుతున్నారు.ఇటీవల సీనియర్ హీరో రాజశేఖర్ నటించిన శేఖర్ సినిమా ఫంక్షన్‌లో రాజశేఖర్‌కి తనను వీరాభిమాని అని తెలిపిన విషయం తెలిసిందే.

"""/"/ అయితే ఆ సినిమా గురించి పూర్తిగా తెలియక ముందే ఆ సినిమానీ, ఆ సినిమాలో నటించిన హీరోనీ ఓ రేంజ్‌లో సుకుమార్ పొగిడేయడం ఏమంత బాగాలేదు అని అభిమానులు అంటున్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా నాని హీరోగా నటించిన అంటే సుందరానికీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మరో సీనియర్ నటుడు అయిన నరేష్‌ని ఆకాశానికెత్తేస్తూ ఆయనకి తాను వీరాభిమానిని అంటూ పొగడ్తలతో ముంచెత్తడంతో సుకుమార్ అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటుగా సోషల్ మీడియాలో సుకుమార్‌ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

అసలెందుకు సుకుమార్ ఇలా చేస్తున్నాడు.? అంటూ ఆరా తీసే పనిలో పడ్డారు అభిమానులు.

వైరల్ ఫొటోస్: బెడ్ రెస్ట్‌లో ఉండి కూడా మొదటి కర్వా చౌత్ జరుపుకున్న స్టార్ హీరోయిన్..