అట్లీపై దారుణమైన కామెంట్స్.. నీ చెత్త సినిమాకు ఆస్కారా అంటూ..

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్( Shahrukh Khan ) హీరోగా నయనతార హీరోయిన్ గా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ( Director Atlee ) దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ''జవాన్''.

( Jawan ) ఈ సినిమా సెప్టెంబర్ 7న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది.

అప్పటి నుండి థియేటర్స్ లో జవాన్ మానియా స్టార్ట్ అయ్యింది.మొదటి షో నుండే పాజిటివ్ టాక్ రావడంతో షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ థియేటర్స్ దగ్గర చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు.

ఇక కాగా ఇందులో దీపికా పదుకొనె కీ రోల్ పోషించింది.అలాగే ఈ సినిమాను రెడ్ చిల్లీస్ ఎంటెర్టైనమెంట్స్ పతాకంపై గౌరీ ఖాన్ నిర్మించగా అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించారు.

యునామినస్ గా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అనే టాక్ వచ్చింది.ఇక తాజాగా 900 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చి అతి త్వరలోనే 1000 కోట్ల క్లబ్ లోకి వెళ్లేందుకు పరుగులు తీస్తుంది.

"""/" / అయితే ఇప్పటి వరకు జవాన్ సినిమాను పొగిడేసిన వారే తాజాగా డైరెక్టర్ అట్లీ( Director Atlee ) చేసిన చిన్న కామెంట్ తో దీనిని ట్రోల్స్ చేస్తున్నారు.

ఆయన ఒక మీడియాతో మాట్లాడుతూ జవాన్ సినిమాను ఆస్కార్ కు( Oscar Award ) తీసుకు వెళతామంటూ చెప్పారు.

దీంతో ఈ కామెంట్స్ పై నెటిజెన్స్ ఓ రేంజ్ లో ఈయనపై విమర్శలు గుప్పిస్తున్నారు.

"""/" / జవాన్, ఆస్కార్ అనే మాట అట్లీ నోటి నుండి రావడమే ఆలస్యం నెటిజెన్ల నుండి ఈయనపై నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి.

సౌత్ ఇండియన్ సినిమాలను మొత్తం మిక్సీలో వేసి రుబ్బితే వచ్చిన జవాన్ ను ఏ విధంగా ఆస్కార్ కు పంపిస్తారంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

అలా అయితే ఆస్కార్ అవార్డ్స్ అన్ని జవాన్ సినిమాకే వస్తాయంటూ సెటైర్స్ వేస్తున్నారు.

సక్సెస్ కోసం ఆ విషయంలో రాజీ పడ్డాను.. నెట్టింట రష్మిక క్రేజీ కామెంట్స్ వైరల్!