దేవర థర్డ్ సింగిల్ పై ట్రోల్స్.. ఎన్టీఆర్ ఫ్లాప్ మూవీ సాంగ్ ను కాపీ కొట్టారంటూ?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ( Junior NTR, Koratala Siva) కాంబినేషన్ క్రేజీ కాంబినేషన్ అనే సంగతి తెలిసిందే.

దావూదీ సాంగ్ కు యూట్యూబ్ లో దాదాపుగా 2 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సెప్ట్స్ అదిరిపోయాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.శేఖర్ మాస్టర్ ఈ సాంగ్ కు కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారని తెలుస్తోంది.

అయితే ఈ సాంగ్ పై కొన్ని ట్రోల్స్ వస్తుండటం గమనార్హం. """/" / ఈ సాంగ్ హలమతి హబీబో సాంగ్ ను గుర్తు చేసే విధంగా ఉందని కొంతమంది కామెంట్లు చేస్తుండగా మరి కొందరు ఊసరవెల్లి సినిమాలో ఎలంగో ఏలంగో సాంగ్ ను గుర్తు చేసే విధంగా ఈ పాట ఉందనే కామెంట్లు చేస్తున్నారు.

ఊసరవెల్లి మూవీ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కగా ఎన్టీఆర్ కెరీర్ లోని ఫ్లాప్ సినిమాలలో ఈ సినిమా ఒకటనే సంగతి తెలిసిందే.

ఈ సినిమాలోని పాటను గుర్తు చేసేలా దేవర సినిమాలోని సాంగ్ ఉండటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

"""/" / దేవర సినిమా దావూదీ సాంగ్( Daavudi Song ) కూడా వ్యూస్ పరంగా హిట్టేనని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

అనిరుధ్ బీజీఎం విషయంలో అదరగొడితే మాత్రం దేవర మూవీ రేంజ్ అయితే పెరిగే అవకాశాలు కచ్చితంగా ఉంటాయని చెప్పవచ్చు.

ఎన్టీఆర్ అభిమానుల ఆకలిని తీర్చే మూవీ దేవర అవుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.దేవర సినిమా ప్రమోషన్స్ త్వరలో మొదలుకానున్నాయి.

దేవర సినిమా( Devara Movie ) గంటల నిడివి కాగా నిడివిని తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం అందుతోంది.

దేవర సినిమా టాలీవుడ్ రేంజ్ ను పెంచే సినిమా అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మాస్ ప్రేక్షకులకు విందు భోజనంలా ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది.దేవర మూవీ ఇతర రాష్ట్రాల్లో ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుంటుందో చూడాల్సి ఉంది.

మేం చాలా రిచ్, శ్రీమంతులం.. మహేష్ బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..?