ర‌త‌న్ టాటాపై సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్‌.. ఎందుకంటే..

ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో చాలామంది ప్ర‌ముఖులు ట్రోలింగ్‌కు గుర‌వుతున్నారు.కాగా ఇందులో ఏది నిజ‌మో ఏది అబ‌ద్ధ‌మో తెలియ‌కుండా ఉంటోంది.

చాలా వ‌ర‌కు ఫేక్ అనే లేటుగా తెలుస్తోంది.అయినా నెటిజ‌న్లు అవేవి పెద్ద‌గా ప‌ట్టించుకోకుండా అస‌లు అది నిజ‌మో కాదో కూడా చెక్ చేయ‌కుండా దారుణంగా కామెంట్లు పెట్ట‌డం లేదంటే ట్రోల్ చేయ‌డం ప‌రిపాటిగా మారిపోతోంది.

ఇంకా కొంద‌రు అయితే ప‌నిగ‌ట్టుకుని ఎవరో ఒకరు ప్ర‌ముఖుల మీద ఏదో ఒకటి ప్రచారం చేయ‌డం చాలా కామ‌న్ అయిపోయింది.

అయితే ఇలాంటివి చేయ‌డం వ‌ల్ల వారికి ఏమొస్తుందో తెలియ‌దు గానీ ఆ ప్ర‌ముఖులు మాత్రం చాలా ఇబ్బందులు ప‌డుతున్నారు.

మ‌రీ ముఖ్యంగా సెల‌బ్రిటీలు లేదంటే వ్యాపారవేత్తల విష‌యంలో ఇలాంటి ఫేక్ మెసేజ్ లను ఫార్వ‌ర్డ్ చేయడం జ‌రుగుతోంది.

ఇక ఇప్పుడు మ‌రో ముఖ్క‌య‌మైన పారిశ్రామిక వేత్త అయిన‌టువంటి రతన్ టాటా పేరుమీద దారుణ‌మైన ట్రోలింగ్ న‌డుస్తోంది.

అదేంటంటే ఆయ‌న పేరు మీద ఓ పోస్టు కొద్ది రోజులుగా సోస‌ల్ మీడియాలో తెగ షేర్ అవుతోంది.

ఇందులో ఆయ‌న ఓ మెసేజ్ ఇచ్చిన‌ట్టు ఉంది. """/"/ అదేంటంటే ఆయ‌న మద్యం అమ్మకాలకు కూడా ఆధార్ లింక్‌ను అనుసంధానం చేయాలని అలాగే ఇపుడు ప్ర‌భుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలకు కూడా ఆధార్‌ను లిక్ చేస్తే అస‌లు విష‌యాలు బ‌య‌ట ప‌డుతాయ‌ని చెప్పిన‌ట్టు ఉంది.

ఇంకేముంది నెటిజ‌న్లు దీ్ని దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కూడా తెగ షేర్ చేస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు.

కాగా దీనిపై ఇప్పుడు ఏకంగా రతన్ టాటానే స్వ‌యంగా స్పందించాల్సి వ‌చ్చింది.తాను ఎలాంటి స్టేట్‌మెంట్ ఇవ్వ‌లేద‌ని మద్యానికి ఆధార్ లింక్ చేయాల‌న్న స్టేట్ మెంట్ ఇవ్వలేదంటూ చెప్ప‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

అంటే ఫేక్ పోస్టుల దెబ్బ‌కు టాటానే దిగివచ్చాడన్న మాట.

తెలంగాణ కాంగ్రెస్ ప్రత్యేక మ్యానిఫెస్టో విడుదల