అరవింద సమేత పరిస్థితి ఏంటీ.. త్రివిక్రమ్‌ టైంకు తీసుకు రాగలడా

ఎన్టీఆర్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అరవింద సమేత’.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈచిత్రంను దసరా కానుకగా అక్టోబర్‌లో విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే త్రివిక్రమ్‌ అండ్‌ టీం ప్రకటించారు.

కాని కొన్ని కారణాల వల్ల షూటింగ్‌ ఆలస్యం అవుతూ వస్తుంది.ఈమద్య విదేశాల్లో షెడ్యూల్‌ను ప్లాన్‌ చేసిన త్రివిక్రమ్‌ టైం లేని కారణంగా ఆ షెడ్యూల్‌ను క్యాన్సిల్‌ చేయడం జరిగింది.

హడావుడిగా చిత్రంను పూర్తి చేయాలని ఇండియాలోనే ఆ షెడ్యూల్స్‌ను ప్లాన్‌ చేశాడు. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్‌ దాదాపుగా పూర్తి అయ్యిందని, ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన పాటలు మాత్రమే బ్యాలన్స్‌ ఉన్నాయి అంటూ సమాచారం అందుతుంది.

ఈలోపు హరికృష్ణ మృతితో సినిమాపై అనుమానాలు పెరుగుతున్నాయి.తండ్రి మరణంతో కనీసం పది రోజుల వరకు అయినా ఎన్టీఆర్‌ చిత్రీకరణకు రాకపోవచ్చు.

దాంతో చిత్రం విడుదల తేదీ ముంచుకు వచ్చేస్తోంది.ఆ కారణంగా సినిమా విడుదల తేదీని మారుస్తారేమో అంటూ సినీ వర్గాల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో దసరాకు తీసుకు రావాలనే పట్టుదలతో ఉన్నాడు.

ఈయన ఎంత పట్టుదలతో ఉన్నా కూడా పరిస్థితులు మాత్రం సహకరించడం లేదు.తండ్రి మరణంతో పుట్టెడు దుఖంలో ఉన్న ఎన్టీఆర్‌ షూటింగ్‌కు ఎప్పుడు వచ్చేనో తెలియడం లేదు.

ఎన్టీఆర్‌ను పిలిచే పరిస్థితి అస్సలే లేదు.దాంతో చిత్ర దర్శకుడు పెద్ద చిక్కుల్లో పడ్డాడు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ఎన్టీఆర్‌ మంచి డ్యాన్సర్‌ కనుక పాటల చిత్రీకరణ వెంటనే పూర్తి అయ్యే అవకాశం ఉంది.

కాని అనుకున్న రీతిలో సినిమాను చేయాలి అంటే ఖచ్చితంగా చాలా సమయం పడుతుందని, అలా అయితే దసరాకు చిత్రం రావడం దాదాపు కష్టం అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.

ఇలాంటి సమయంలో దర్శకుడు ఏం చేస్తాడు, అసు త్రివిక్రమ్‌ తన సినిమాను సమయానికి తీసుకు వస్తాడా లేదా అనేది చూడాలి.