ఆ పాపకు త్రివిక్రమ్ రెండో ఛాన్స్ ఇచ్చేనా..?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన రీసెంట్ మూవీ అల వైకుంఠపురములో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది.

ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించడంతో ప్రేక్షకులు ఈ సినిమాను విపరీతంగా ఎంజాయ్ చేశారు.

ఇక సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన ఈ సినిమా రూ.150 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టి బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.

ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటించగా మరో బ్యూటీ నివేథా పేతురాజ్ కూడా ఈ సినిమాలో నటించింది.

అయితే సుశాంత్‌ను ప్రేమించే పాత్రలో నివేథా పేతురాజ్ కనిపించింది.అయితే ఆమెకు పెద్దగా స్కోప్‌లేని పాత్ర కావడంతో త్రివిక్రమ్ చాలా ఫీలయ్యాడట.

నివేథా పేతురాజ్ నిజానికి చాలా బాగా యాక్ట్ చేయగలదని తెలుసుకున్న త్రివిక్రమ్, ఆమెకు ప్రాముఖ్యత లేని పాత్ర రావడంతో తన నెక్ట్స్ మూవీలో ఖచ్చితంగా ప్రాముఖ్యత ఉన్న పాత్రను ఆమెకు ఇస్తానని మాటిచ్చారట.

""img "aligncenter" Src="" / కాగా త్రివిక్రమ్ తన నెక్ట్స్ మూవీని తారక్‌తో చేయనున్న విషయం తెలిసిందే.

మరి ఈ సినిమాలో నివేథా పేతురాజ్‌కు ఎలాంటి ఆఫర్ లభిస్తుందో చూడాలి అంటున్నారు సినీ జనం.

ఏదేమైనా ఓ మీడియం రేంజ్ హీరోయిన్‌కు తన సినిమాలో రెండో అవకాశం ఇవ్వనుండటంతో త్రివిక్రమ్ మరోసారి వార్తల్లో నిలిచాడు.

మహేష్ బాబు రాజమౌళి సినిమా మీద గాసిప్ వార్తలను స్ప్రెడ్ చేస్తుంది ఎవరు..?