వెంకటేష్‌ 75వ సినిమా అప్‌డేట్‌... ఫ్యాన్స్‌ కు పండుగలాంటి వార్త

విక్టరీ వెంకటేష్‌ కెరీర్‌లో ఇప్పటి వరకు 73 చిత్రాల్లో నటించాడు.తాజాగా వరుణ్‌ తేజ్‌తో కలిసి నటించిన 'ఎఫ్‌ 2' చిత్రం ఆయన 73వ చిత్రంగా చెబుతున్నారు.

అతి త్వరలోనే 74వ చిత్రంగా 'వెంకీ మామ' మొదలు కాబోతుంది.నాగచైతన్యతో కలిసి వెంకటేష్‌ నటించబోతున్నాడు.

ఇక ఏ హీరోకైనా 25, 50, 75, 100 ఈ సినిమాలు చాలా ప్రత్యేకంగా చెప్పుకుంటారు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 100వ సినిమాను వెంకీ చేస్తాడనే నమ్మకం లేదు.అందుకే 75వ చిత్రంను చాలా ప్రతిష్టాత్మకంగా చేయాలని భావిస్తున్నారు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ వెంకీ మామతో 74 చిత్రాలను పూర్తి చేసుకున్న తర్వాత వెంకటేష్‌ తర్వాత 75వ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌తో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు.

అందుకోసం కథ కూడా సిద్దం అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది.చాలా కాలంగా వెంకటేష్‌, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో సినిమా రాబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం అల్లు అర్జున్‌తో సినిమా ఏర్పాట్లు చేస్తున్న త్రివిక్రమ్‌ ఆ తర్వాత సినిమాను వెంకటేష్‌తో చేయడం దాదాపుగా కన్ఫర్మ్‌ అయ్యింది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ సురేష్‌బాబు గట్టి ప్రయత్నాలు చేసి వెంకీ మరియు త్రివిక్రమ్‌ల కాంబో సెట్‌ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.

వెంకీ కెరీర్‌లో 75వ చిత్రం చాలా ప్రతిష్టాత్మకం కనుక ఆ చిత్రాన్ని తానే నిర్మించాలని కూడా సురేష్‌బాబు భావిస్తున్నాడు.

అందుకోసం చర్చలు మొదలయ్యాయని, త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని సురేష్‌ ప్రొడక్షన్స్‌ వర్గాల వారు చెబుతున్నారు.

ప్రస్తుతం ఎఫ్‌2 చిత్రం సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్న వెంకటేష్‌ అదే తరహాలో వెంకీ మామను చేయబోతున్నాడు.

ఆ తర్వాత మల్లీశ్వరి వంటి ఎంటర్‌టైనర్‌ కథతో త్రివిక్రమ్‌ దర్శకత్వంలో చేయబోతున్నాడు.

హెయిర్ బ్రేకేజ్ కు చెక్ పెట్టే బెస్ట్ అండ్ న్యాచురల్ టానిక్ ఇది.. డోంట్ మిస్!