త్రివిక్రమ్ వేలు పెట్టకపోతేనే పవన్ కెరీర్ కు మంచిదా.. ఆకలి తీర్చే సినిమాలు ఎక్కడంటూ?
TeluguStop.com
పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్( Pawan Kalyan ,Trivikram ) కాంబినేషన్ టాలీవుడ్ ఇండస్ట్రీలోని అద్భుతమైన కాంబినేషన్లలో ఒకటి.
ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.
పవన్ త్రివిక్రమ్ కాంబోకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.అయితే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలు అన్నీ త్రివిక్రమ్ సెట్ చేసిన సినిమాలే కావడం గమనార్హం.
త్రివిక్రమ్ వేలు పెట్టకపోతేనే పవన్ కెరీర్ కు మంచిదని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ ఎక్కువ రోజులు షూటింగ్ లో పాల్గొనని ప్రాజెక్ట్ లు, రీమేక్ సినిమాలను ఎక్కువగా సెట్ చేస్తున్నారు.
ఈ సినిమాల వల్ల పవన్ కళ్యాణ్ కు పారితోషికం రూపంలో ఎక్కువ మొత్తం దక్కుతున్నా సినిమాల ఫలితాలు మాత్రం ఆశించిన రేంజ్ లో ఉండటం గమనార్హం.
"""/" /
పవన్ కళ్యాణ్ అభిమానుల ఆకలి తీర్చే సినిమాలు ఎప్పుడు వస్తాయో చూడాల్సి ఉంది.
పవన్ కు త్రివిక్రమ్ సలహాలు ఇవ్వకుండా ఉంటే మాత్రమే పవన్ కళ్యాణ్ కెరీర్ బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
పవన్ కెరీర్ పరంగా త్రివిక్రమ్ వల్ల నష్టపోతున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా( OG Movie ) అయినా హిట్ అవుతుందేమో చూడాలి.
"""/" /
పవన్ కళ్యాణ్ సుజీత్( Sujeet ) కాంబో నెక్స్ట్ లెవెల్ కాంబో కాగా దానయ్య నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కుతోంది.
పవన్ సుజీత్ కాంబో మూవీ స్ట్రెయిట్ మూవీ కాగా ఈ సినిమా స్క్రీన్ ప్లేలో త్రివిక్రమ్ జోక్యం లేకపోయినా ఈ ప్రాజెక్ట్ ను సెట్ చేసింది కూడా త్రివిక్రమ్ కావడం గమనార్హం.
సినిమా సినిమాకు పవన్ కళ్యాణ్ మార్కెట్ అంతకంతకూ పెరుగుతోంది.త్రివిక్రమ్ పై ఈ మధ్య కాలంలో ప్రేక్షకుల్లో నెగిటివిటీ పెరుగుతుండటం గమనార్హం.
వీడియో వీడియో: కింగ్ కోబ్రా పుట్టుకను చూసారా ఎప్పుడైనా?