అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు సీతారామశాస్త్రి.. అప్పటి త్రివిక్రమ్ ఎమోషనల్ వీడియో వైరల్!

ప్రముఖ సినీ గేయ రచయితలలో ఒకరైన సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూత వల్ల సినీ ప్రముఖులు, సిరివెన్నెల సీతారామశాస్త్రి అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ప్రముఖ దర్శకులలో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలా సంవత్సరాల క్రితమే సిరివెన్నెల సీతారామశాస్త్రి గొప్పదనాన్ని చెప్పుకొచ్చారు.

సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు సినీ కవి కావడం తెలుగువారి అదృష్టమని అయితే అది ఆయన దురదృష్టమని త్రివిక్రమ్ తెలిపారు.

సీతారామశాస్త్రి కవిత్వం గురించి చెప్పాలంటే తన శక్తి సరిపోదని త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పుకొచ్చారు.

నాకున్న పదాలు సరిపోవని త్రివిక్రమ్ తెలిపారు.సిరివెన్నెల మూవీలోని ప్రాగ్దిశ వేణియమైన పాట విన్న తర్వాత తెలుగు డిక్షనరీ ఉంటుందని తనకు తెలిసిందని త్రివిక్రమ్ శ్రీనివాస్ వెల్లడించారు.

ప్రాగ్దిశ అంటే ఏమిటో, మయూఖం అంటే ఏమిటో తాను తెలుసుకున్నానని త్రివిక్రమ్ శ్రీనివాస్ పేర్కొన్నారు.

"""/" / ఒక పాటను అర్థం అయ్యే విధంగా రాయాల్సిన అవసరం లేదని అర్థం చేసుకోవాలనే కోరిక పుట్టేలా కూడా రాయొచ్చని త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పుకొచ్చారు.

సిరివెన్నెల సీతారామశాస్త్రి అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు త్రివిక్రమ్ అన్నారు.అక్షరాలు అనే తూటాలతో పదాలు అనే కిరణాలతో సిరివెన్నెల సీతారామశాస్త్రి ప్రపంచం మీద వేటాడటానికి బయలుదేరాడని త్రివిక్రమ్ చెప్పుకొచ్చారు.

"""/" / సాహిత్యానికి ప్రతి మనిషిని కదిలించే శక్తి ఉందని త్రివిక్రమ్ వెల్లడించారు.

త్రివిక్రమ్ గతంలో మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.త్రివిక్రమ్ మాట్లాడిన ఈ వీడియోకు 4 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

సిరివెన్నెల మృతిపై రాజకీయ ప్రముఖులు కూడా సంతాపం తెలియజేశారు.సీఎం జగన్, సీఎం కేసీఆర్ ట్విట్టర్ ద్వారా సిరివెన్నెల మృతికి సంతాపం తెలియజేశారు.

సిరివెన్నెల మృతి తెలుగు సినిమాకు తీరని లోటు అని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.

సాహితీ ప్రియులు, సినీ ప్రముఖులు సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలియజేశారు.

వైట్ శారీలో దేవకన్యలా మంచు లక్ష్మి.. అలాంటి కామెంట్స్ చేస్తున్న నెటిజన్స్!