మహేష్ కోసం వాళ్లని మార్చేస్తున్న త్రివిక్రమ్..!

త్రివిక్రం డైరక్షన్ లో సూపర్ స్టార్ మహేష్ హీరోగా ఓ సినిమా స్టార్ట్ కాబోతున్న విషయం తెలిసిందే.

త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా కోసం త్రివిక్రం చాలా మార్పులు చేసినట్టు తెలుస్తుంది.

ముఖ్యంగా తన టీం ని త్రివిక్రం మార్చేశాడట.తనతో పాటు కొన్నాళ్లుగా రైటింగ్ టీం లో పనిచేస్తున్న వారిని తీసేసి కొత్త రైటర్స్ ని హైర్ చేసుకున్నట్టు తెలుస్తుంది.

త్రివిక్రం స్వతహాగా ఓ రచయిత అయినా ఓ సినిమాకైనా రైటర్స్ ఒకరు ఇద్దరు ఉండాల్సిందే.

అందుకే త్రివిక్రం ఈ సినిమాకు కొత్త టీం ని తీసుకున్నారట.స్టార్ డైరక్టర్ లో పనిచేసిన టీం ఆ తర్వాత సొంతంగా సినిమాలు చేస్తుంటారు.

త్రివిక్రం తన టీం ని మార్చడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.

మహేష్ సినిమా కోసం త్రివిక్రం కొత్త వళ్లని టీం లోకి చేర్చుకున్నారట.ఇక సినిమా విషయానికి వస్తే పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది.

హారిక హాసిని బ్యానర్ లో రాబోతున్న ఈ సినిమాతో త్రివిక్రం, మహేష్ హ్యాట్రిక్ హిట్ కొడతారని చెప్పొచ్చు.

 ఈ సినిమాని 2023 ఏప్రిల్ 28 రిలీజ్ డేట్ కూడా లాక్ చేశారు.

కిడ్నీ స్టోన్స్ ఏర్పడటానికి కార‌ణాలేంటి.. లక్ష‌ణాలు ఎలా ఉంటాయి..?