ఒకటి కాదు రెండు కాదు.. 20 ఏళ్ల నుంచి సెంటిమెంట్ తో త్రివిక్రమ్ ఆ పనిచేస్తున్నాడట?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో దర్శకనిర్మాతలు కొన్ని సెంటిమెంట్ లను బాగా ఫాలో అవుతూ ఉంటారు.

ఇక ప్రతి సినిమా విషయంలో కూడా ఈ సెంటిమెంట్ కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉంటుంది.

అలాగే టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా ఉన్న త్రివిక్రమ్ కి కూడా ఒక సెంటిమెంట్ ఉందట.

త్రివిక్రమ్ కు ఉన్న సెంటిమెంట్ గురించి తెలుసుకోవాలి అంటే ముందుగా త్రివిక్రమ్ గురించి కాస్త ఇంట్రడక్షన్ ఇస్తే బాగుంటుంది కదా.

ఇక కాస్త ఇంట్రడక్షన్ లోకి వెళితే.అతను ఒక మాటల రచయిత.

తెలుగు సినిమాలకు రచయితగా పనిచేశారు.డైలాగులతో ఎంతో మంది ప్రేక్షకులను మెప్పించారు.

ఇంతలో డైరెక్టర్ అవ్వాలని ఆలోచన ఆయనకు వచ్చింది.దీంతో ఇక తాను రాసిన కథలను తాను డైరెక్ట్ చేయడం మొదలుపెట్టారు.

తక్కువ సమయంలోనే స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు.ఇక తెలుగు ప్రేక్షకులందరికీ మాటల మాంత్రికుడు గా మారిపోయాడు త్రివిక్రమ్.

ఇక ఇప్పుడు పెద్ద హీరోలందరితో సినిమాలు చేస్తూ బిజీ బిజీగా మారిపోయాడు.ఇక అలాంటి త్రివిక్రమ్ 20 ఏళ్ల నుంచి ఒక సెంటిమెంట్ ను మాత్రం అస్సలు మర్చిపోలేదట.

అదేమిటంటే ఆయన రూమ్.హైదరాబాద్ లో అష్ట కష్టాలు పడ్డ త్రివిక్రమ్ పంజాగుట్టలోని ఓ చిన్న రూమ్ లో అద్దెకు ఉండే వారు.

కనీసం రెంట్ కట్టలేని స్థితిలో ఉండేవారు.అదే రూమ్ లో ఉండి త్రివిక్రమ్ రచయితగా ఆ తర్వాత దర్శకుడిగా మారిపోయారు.

"""/"/ దీంతో త్రివిక్రమ్ అది లక్కీ రూమ్ అని భావిస్తూ ఉంటారట.ఇక ఆ రూమ్ కి ఇప్పటికి రెంట్ కింద ప్రతినెలా ఐదు వేల రూపాయల పంజాగుట్టలోని రూమ్ ఓనర్ కి పంపిస్తారట త్రివిక్రమ్.

అప్పుడప్పుడు రూమ్ కి వెళ్లి కాసేపు కూర్చుని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని సేదతీరడం చేస్తాడట త్రివిక్రం.

ఇక 20 ఏళ్లుగా ఏళ్లుగా ఇలాగే రూమ్ రెంట్ ఇస్తూ వస్తున్నారట త్రివిక్రమ్.

ఇక ఆ రూమ్ ఓనర్ కూడా ఎవరు ఎక్కువ ఇస్తామని అడిగిన రూమ్ వేరే వాళ్ళకి రెంటుకు ఇవ్వడం లేదట.

నేను చేసిన పెద్ద తప్పు అదే… బండ్ల గణేష్ సంచలన పోస్ట్!