బన్నీ, త్రివిక్రమ్ మూవీ ఫిక్స్... ఆ వార్తతో నీరుగారి పోతున్న ఫ్యాన్స్
TeluguStop.com
అల్లు అర్జున్ నా పేరు సూర్య చిత్రం తర్వాత దాదాపు సంవత్సరం గ్యాప్ తీసుకున్నాడు.
తాజాగా అల్లు అర్జున్ తర్వాత సినిమాపై అధికారిక ప్రకటన వచ్చింది.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ తదుపరి చిత్రం ఉండబోతుంది.
అందుకోసం ఏర్పాట్లు కూడా ప్రారంభం అయ్యాయి.రాధాకృష్ణ మరియు అల్లు అరవింద్‌లు సంయుక్తంగా నిర్మించబోతున్న ఈ చిత్రం కథ విషయంలో ప్రస్తుతం మీడియాలో రకరకాలుగా వార్తలు వస్తున్నాయి.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
త్రివిక్రమ్ గతంలో అల్లు అర్జున్‌తో తెరకెక్కించిన జులాయి మరియు సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు తండ్రి కొడుకుల నేపథ్యంలో ఉన్న విషయం తెల్సిందే.
తాజాగా ఈ చిత్రంలో కూడా తండ్రి, కొడుకుల అనుబంధం మద్య సన్నివేశాలుంటాయని సినీ వర్గాల వారు అంటున్నారు.
ప్రస్తుతం సినిమాకు చెందిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది.అందుకోసం త్రివిక్రమ్ టీం తీవ్రంగా శ్రమిస్తోంది.
మొదట ఈ చిత్రంకోసం ఒక బాలీవుడ్ మూవీని పరిశీలించారు.కాని ఆ సినిమా వల్ల తెలుగు ప్రేక్షకులను సంతృప్తి పర్చడం కష్టంగా భావించిన త్రివిక్రమ్ కొత్త కథను సిద్దం చేశాడు.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
ఇప్పటికే సక్సెస్ అయిన ఫార్ములాను మరోసారి కూడా వర్కౌట్ చేయాలని నిర్ణయించుకున్నాడు.
తండ్రి కొడుకుల మద్య సెంటిమెంట్ ను గతంలో చూపించిన దర్శకుడు త్రివిక్రమ్ ఈసారి విభిన్నంగా తండ్రి కొడుకులను చూపించాలని భావిస్తున్నాడట.
అయితే ఈసారి కూడా తండ్రి కొడుకుల మూవీ అవ్వడంతో ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే వచ్చిన సినిమాల కాన్సెప్ట్‌తో తెరకెక్కిస్తే ఈసారి సక్సెస్ దక్కేనా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
200 మంది భారతీయులను బహిష్కరించిన అమెరికా