త్రిశక్తి యంత్రం వల్ల కల్గే లాభాలు తెలిస్తే.. ఇప్పడే తెచ్చి ఇంట్లో పెట్టేస్తారు!
TeluguStop.com
త్రిశక్తి యంత్రం గురించి కొందరికి మాత్రమే తెలుస్తుంది.కానీ తెలిసిన ప్రతీ ఒక్కరి ఇంట్లో, ముఖ్యంగా ఉంటి గుమ్మంలో మనం ఈ యంత్రాన్ని చూడవచ్చ.
ముఖ్యంగా శ్రావణ మాసంలో ఎక్కువగా దీన్ని తీసుకొచ్చి ఇంట్లో తగిలించుకుంటారు.ఈ త్రిశక్తి యంత్రాన్ని పెడితే ఏడాది పొడవునా ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయని ప్రజల నమ్మకం.
స్వస్తిక్, ఓం, త్రిశూలం కలిసి ఉన్న దాన్నే త్రిశక్తి యంత్రం అంటారు.దీన్ని ఇంటి ద్వారం వద్ద ఉంచడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.
అలాగే ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు కళకాలం అలాగే ఉంటాయి.వాస్తు ప్రకారం ఈ యంత్రాన్ని బయట ఉంచడం వల్ల దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటాయి.
నర దిష్టితో పాటు చెడు దృష్టి కూడా మనపై పడదు.త్రిశూలం గుర్తు వల్ల 3 రకాల దుఃఖాలను నాశనం చేస్తుంది.
శివుని చేతిలో ఉండే ఈ త్రిశూలం సత్వ, రజ, తమో అనే మూడు గుణాలను సూచిస్తుంది.
ఈ మూడింటి వల్ల మనకు చాలా మంచి జరుగుతుంది.ఓం కారం సింబల్ వల్ల నాదానికి చిహ్మం.
ఓం అని పలుకుతున్నప్పుడు అ, ఉ, మ అనే మూడు అక్షరాలతో ఏర్పడుతుంది.
ఈ మూడు పదాలు భూలోక, భవలోక, స్వర్గ లోకానికి ప్రతీక.సృష్టి ప్రారంభంలో ఓం అనే శబ్దం ప్రతిధ్వనించింది.
అలాగే స్వస్తిక్ సింబల్ వల్ల అదృష్టం కల్గుతుంది.గోడలపై దీన్ని రాయడం ద్వారా లక్ష్మీదేవి ఆ ఇంట్లో శాశ్వతంగా నిలుస్తుందని నమ్ముతారు.
ప్రశాంత్ నీల్ ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ అవుతాడా..?