జయలలిత బయోపిక్లో నటించడానికి నేను సిద్దం - త్రిష

ప్రస్తుతం బయోపిక్ ల ట్రెండ్ నడుస్తుంది.సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి,సంజయ్ దత్ జీవితచరిత్ర సంజు ఇటీవల ఎంత పెద్ద హిట్ సాధించాయో మనకు తెలిసిందే.

మహానటి తర్వాత బయోపిక్ల పట్ల అటు మేకర్స్ లోనూ,ఇటు ప్రేక్షకుల్లోనూ ప్రత్యేక ఆసక్తి నెలకొంది.

తాజాగా మరికొంతమంది రాజకీయ,సినీ,క్రీడా ప్రముఖుల జీవితకథల ఆధారంగా కొన్ని సినిమాలు రాబోతున్నాయి.అయితే తమిళనాడు మాజి ముఖ్యమంత్రి దివంగత నటి జయలలిత బయోపిక్ తీయాలనే యోచన ఎప్పటినుండో ఉందో.

ఒకవేళ జయలలిత బయోపిక్ తీస్తే అందులో నటించడానికి సిద్దం అంటుంది నటి త్రిష.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ త్రిష చిత్ర పరిశ్రమకు వచ్చి దశాబ్దం పైనే అవుతుంది.

ఇన్నేళ్లలో ఎన్నో మంచి చిత్రాల్లో నటించి దక్షిణాదిన గుర్తింపు తెచ్చుకుంది.ఇటీవల మోహిని చిత్రంలో ద్విపాత్రాభినాయం చేసినప్పటికి త్రిషకు హిట్ దక్కలేదు.

హీరోయిన్ గా అవకాశాలు తగ్గాకా త్రిష లేడి ఓరియెంటెడ్ చిత్రాలపై దృష్టి పెట్టింది.

ఆ తరహాలో వచ్చినవే నాయకి,మోహిని తదితర చిత్రాలు.ఆ క్రమంలో త్రిష తాజాగా చేసిన కామెంట్స్ ఆసక్తిగా మారాయి.

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ తెరకెక్కించాలని ఎప్పటినుంచో చర్చలు జరుగుతున్నాయి.జయలలితగా నటించే అవకాశం వస్తే వదులుకునే హీరోయిన్లు ఉండరు.

అందుకేనేమో ఈ చిత్రంపై త్రిష కాస్త ముందుగా స్పందించింది.జయలలిత అంటే తనకు చాలా ఇష్టం అని, తాను పదేళ్ల వయసులో స్కూల్లో చదువుకుంటుండగా.

జయలలిత తన పాఠశాలకు చీఫ్ గెస్ట్ గా వచ్చారని.అప్పట్నుంచి ఆమె అంటే ఇష్టమని త్రిష చెప్పింది.

జయలలితపై ఇష్టంతోనే తాను తన ట్విట్టర్ ప్రొఫైల్ పేజీలో జయలలిత నుంచి అవార్డు తీసుకుంటున్న ఫొటో పెట్టినట్లు త్రిష వెల్లడించింది.

అంతేకాదు జయలలిత మరణించినప్పుడు ఆమె సమాధి వద్దకు వెళ్లి నివాళులర్పించింది.జయలలిత మరణం తీరని లోటని.

ఆమెకు ఆమే సాటి అని త్రిష చెప్పింది.ఆమె బయోపిక్ తీస్తే చేయడానికి తాను సిద్ధమని.

కానీ తనకు ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని.కేవలం జయలలితపై ఉన్న ఆరాధనభావంతోనే ఈ సినిమా చేయాలనుకుంటున్నానను అంటూ చెప్పుకొచ్చింది.

ఏపీ సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్..!!