Trisha : ఆ చిన్న పని చేసి స్టార్ హీరో నుంచి ఐదు కోట్లు అందుకున్న త్రిష.. పెద్ద తప్పు చేసిందిగా?

సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో సీనియర్ నటి త్రిష( Trisha ) ఒకరు ఈమె ఒకానొక సమయంలో హీరోయిన్గా తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

ఇలా ఈ రెండు భాషలలో అగ్ర హీరోలందరి సరసన నటించి మెప్పించినటువంటి త్రిషకు క్రమక్రమంగా అవకాశాలు తగ్గిపోయాయి.

ఇలా తనకు కమర్షియల్ సినిమాలలో నటించే అవకాశాలు రాకపోవడంతో లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో కొనసాగారు.

ఇక లేడి ఓరియంటెడ్ సినిమాలలో కూడా ఈమెకు అనుకున్న స్థాయిలో పెద్దగా సక్సెస్ రాలేకపోయిన దీంతో అవకాశాలు కూడా పూర్తిగా కోల్పోయారు.

ఇలా అవకాశాలు కోల్పోయినటువంటి త్రిష ఇండస్ట్రీకి దూరమయ్యారు.అయితే ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఈమెకు మణిరత్నం అవకాశం కల్పించారు.

మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈమె తన నటనతో పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

దీంతో ఈమెకు కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు వచ్చాయి.

"""/" / ఇకపోతే త్రిష ప్రస్తుతం తెలుగులో కూడా సినిమా అవకాశాలను అందుకుంటున్నారు.

ఈమె మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) హీరోగా నటిస్తున్నటువంటి విశ్వంభర ( Vishwambhara ) సినిమాలో హీరోయిన్గా నటించే అవకాశం అందుకున్న సంగతి మనకు తెలిసిందే.

దాదాపు 18 సంవత్సరాలు తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి త్రిషకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

త్రిష ఫస్ట్ ఇన్నింగ్స్ లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నటువంటి సమయంలో ఒక చిన్న పని చేసి ఏకంగా స్టార్ హీరో నుంచి ఐదు కోట్ల రూపాయలు తీసుకున్నారంటూ ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

"""/" / ఈమె హీరోయిన్గా కొనసాగే సమయంలో స్టార్ హీరోతో సినిమా చేసే అవకాశం వచ్చిందట అయితే ఆ హీరోకి ఈమె హీరోయిన్గా నటించడం ఇష్టం లేకపోవడంతో ఆ సినిమా నుంచి తప్పుకుంటే తనకి ఇష్టమైన హీరోయిన్ ఈ సినిమాలో భాగమవుతుందని చెప్పి త్రిష ఏకంగా ఐదు కోట్ల రూపాయల ఆఫర్ డిమాండ్ చేశారట ఇలా ఐదు కోట్ల రూపాయలు తీసుకొని ఈ సినిమా నుంచి తప్పుకొమ్మని చెప్పగా త్రిష మారు మాట్లాడకుండా ఆ డబ్బు తీసుకొని సినిమా నుంచి తప్పుకున్నారని తెలుస్తుంది .

అయితే ఈమె ఈ సినిమా నుంచి తప్పుకున్న తర్వాత ఆ హీరోయిన్ సినిమాలో భాగం అవ్వడమే కాకుండా బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారని తెలుస్తుంది.

ఇలా డబ్బు తీసుకొని ఈమె ఒక హిట్ సినిమాని మిస్ చేసుకున్నారని ఈ వార్త హాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది.

రూ.1000తో బాలిలో ఏం దొరుకుతుందో తెలుసా.. తెలిస్తే షాక్ అవుతారు..