గోట్ స్పెషల్ సాంగ్ కోసం త్రిష రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా… దిమ్మతిరిగి పోవాల్సిందే!
TeluguStop.com
సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో సీనియర్ నటి త్రిష( Trisha ) ఒకరు.
ఈమె హీరోయిన్గా తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇలా ఒకానొక సమయంలో అగ్ర హీరోలు అందరి సరసన నటించిన త్రిష ఒకానొక సమయంలో అవకాశాలను కోల్పోయారు.
ఇలా ఈమెకు అవకాశాలు తగ్గడంతో ఇండస్ట్రీకి కొంతకాలం పాటు దూరంగా ఉన్నారు.అయితే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన త్రిష వరుస సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.
"""/" /
ప్రస్తుతం తెలుగు తమిళ భాష చిత్రాలలో అగ్ర హీరోలు అందరు సరసన అవకాశాలు అందుకోవడమే కాకుండా భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటూ కెరియర్ పట్ల బిజీ అయ్యారు.
ఇదిలా ఉండగా తాజాగా ఈమె కోలీవుడ్ స్టార్ హీరో విజయ్( Vijay ) తో కలిసి నటించిన లియో ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇక ఈ సినిమా తర్వాత మరోసారి హీరో విజయ్ సినిమాలో ఈమె సందడి చేశారు.
ఇటీవల హీరో విజయ్ నటించిన గోట్( GOAT Movie ) అనే సినిమాలో ఈమె స్పెషల్ సాంగ్ చేశారు.
"""/" /
ఇప్పటివరకు త్రిష ఏ సినిమాలో కూడా ఎలా స్పెషల్ సాంగ్( Special Song ) చేయలేదు.
కానీ హీరో విజయ్ తో ఉన్న అనుబంధం కారణంగా డైరెక్టర్ అడగడంతో కాదనలేక ఈమె విజయ్ గోట్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేశారు.
అయితే ఈ పాటలో విజయ్ పక్కన ఈమె రెండు మూడు నిమిషాల పాటు కనిపిస్తూ సందడి చేశారు.
అయితే ఈ స్పెషల్ సాంగ్ చేసినందుకుగాను త్రిష తీసుకున్న రెమ్యూనరేషన్( Remuneration ) కి సంబంధించిన వార్తలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఈ పాట కోసం త్రిష ఏకంగా 1.2 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలిసి అందరూ షాక్ అవుతున్నారు.
ఇక ఈమె సినిమాలలో నటించడం కోసం ఏకంగా 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
అనిమల్ మూవీ నటుడిని కొత్తగా చూపించబోతున్న అనిల్ రావిపూడి…