మీకు సిగ్గనిపించట్లేదా అంటు త్రిష సంచలన వ్యాఖ్యలు.. చనిపోయే వరకు ఆ పని చేస్తానంటూ?
TeluguStop.com

స్టార్ హీరోయిన్ త్రిష( Trisha ) గురించి మనందరికీ తెలిసిందే.గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో త్రిష పేరు మారుమోగుతున్న విషయం మనందరికీ తెలిసిందే.


మొన్నటి వరకు మనసూర్ అలీఖాన్( Mansoor Ali Khan ) త్రిషపై సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఆమె పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోయింది.


ఇది ఇలా ఉంటే గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో త్రిష ఏజ్ విషయంపై అనేక రకాల వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.
దీంతో ఆ వార్తలపై తాజాగా త్రిష స్పందిస్తూ తీవ్ర స్థాయిలో మండిపడింది.ఈ మేరకు త్రిష తన వయసుపై వచ్చిన వార్తలపై స్పందిస్తూ.
ఇప్పుడు నా వయసు జాతీయ సమస్యగా మారింది. """/" /
నాకు నలభై నిండటంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది.
వీళ్లు రాసే రాతలు, వీడియోలు అలాగే ఉన్నాయి మరి.వేరే సమస్యే లేనట్టు చివరకు నా వయసు గురించి పిచ్చి రాతలు రాయడం.
సిగ్గనిపించడంలేదా? అంటూ కొన్ని సాంఘిక మాధ్యమాలపై అంతెత్తు లేచింది త్రిష.బుద్ధిలేనివాళ్లు చేసే న్యూసెన్స్ ఇది.
మొదట్లో పట్టించుకోకూడదనే అనుకున్నాను.కానీ ఆగేలా లేవు.
అందుకే మాట్లాడుతున్నాను.భారతీయ సినీ పరిశ్రమలో( Indian Film Industry ) 40 దాటిన కథానాయికలు చాలామంది ఉన్నారు.
నేనే ప్రథమం కాదు.నాకు ఇప్పటికీ అవకాశాలు రావడం కొందరికి కంటగింపుగా ఉన్నట్టుంది.
అందుకే పిచ్చి కామెంట్లు పెడుతున్నారు.నేను నటిని.
చనిపోయేదాకా నటిస్తూనే ఉంటాను. """/" /
నటనకు వయసుతో నిమిత్తం లేదు.
ఆ మాత్రం కామన్‌సెన్స్ లేకపోతే ఎలా? నా అందం, నా అభినయ సామర్థ్యం నాకు గర్వకారణాలు అంటూ భావోద్వేగంగా స్పందించింది త్రిష.
త్రిష చేసిన పోస్టులపై నెటిజన్స్ అభిమానులు రకరకాలుగా స్పందిస్తూ ఆమెకు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.
ఇకపోతే ప్రస్తుతం ఈమె కోలీవుడ్లో స్టార్ హీరోయిన్గా రాణిస్తూ వరుసగా అవకాశాలను అందుకుంటు దూసుకుపోతోంది.
ఈమె సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి కొన్ని ఏళ్లు పూర్తి అవుతున్న ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది.
హల్దీ వేడుకలో వధూవరులకు ఝలక్ ఇచ్చిన కోతి