త్వరలోనే త్రిష పెళ్లి అంటూ వార్తలు.. నిజమేంటంటే..?
TeluguStop.com
గతేడాది లాక్ డౌన్ నిబంధనలు అమలైన సమయంలో టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో చాలామంది సెలబ్రిటీల పెళ్లిళ్లు జరిగాయి.
అయితే కొంతమంది హీరోయిన్లకు సంబంధించి పెళ్లి వార్తలు తరచూ వైరల్ అవుతున్నా ఆయా హీరోయిన్ల పెళ్లిళ్లు మాత్రం జరగడం లేదు.
కొన్ని రోజుల క్రితం త్రిష ప్రముఖ నటుడు శింబును పెళ్లి చేసుకోబోతున్నారంటూ గాసిప్స్ గుప్పుమన్న సంగతి తెలిసిందే.
అయితే వైరల్ అవుతున్న వార్తలపై శింబు కానీ త్రిష కానీ స్పందించి స్పష్టతనివ్వలేదు.
అయితే కోలీవుడ్ ఇండస్ట్రీలో మళ్లీ త్రిష పెళ్లికి సంబంధించి ప్రచారం జరుగుతోంది.వైరల్ అవుతున్న వార్త ప్రకారం అతి త్వరలో త్రిష పెళ్లి జరగనుందని తెలుస్తోంది.
త్రిష ఒంటరి జీవితానికి గుడ్ బై చెప్పడానికి ఎన్నో రోజులు లేదని ఆ వార్త సారాంశం.
ప్రస్తుతం త్రిష వయస్సు 37 సంవత్సరాలు.గతంతో పోలిస్తే త్రిషకు సినిమా ఆఫర్లు కూడా ఎక్కువగా లేవు.
"""/"/
కోలీవుడ్ ఇండస్ట్రీలో త్రిషకు అడపాదడపా ఆఫర్లు వస్తున్నా టాలీవుడ్ లో మాత్రం త్రిషను ఎవరూ పట్టించుకోవడం లేదు.
గతంలో ప్రముఖ బిజినెస్ మేన్ వరుణ్ మణియన్ తో త్రిష్ కు ఎంగేజ్ మెంట్ జరగగా కొన్ని కారణాల వల్ల వరుణ్ త్రిషల పెళ్లి ఆగిపోయింది.
త్రిష పెళ్లికి సంబంధించి మళ్లీ వార్తలు వైరల్ అవుతుండగా త్రిషకు సంబంధించిన పెళ్లి వార్తలు త్వరలోనే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.
త్రిష ఎవరిని వివాహం చేసుకోబోతుందో తెలియాలంటే మాత్రం కొన్ని రోజులు ఆగాల్సిందే.అందం, అభినయం పుష్కలంగా ఉన్న త్రిష కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నా కొత్త హీరోయిన్ల రాకతో త్రిషకు హీరోయిన్ గా అవకాశాలు తగ్గడం గమనార్హం.
గతేడాది త్రిషకు పెద్దగా కలిసిరాకపోయినా ఈ ఏడాది ఆమె వరుస ఆఫర్లతో బిజీ అవుతారేమో చూడాల్సి ఉంది.
వైరల్ వీడియో: దేవుడా. రన్నింగ్ ట్రైన్‌పై ప్రయాణించిన వ్యక్తులు.. చివరకు.