ఆ స్టార్ హీరోకు భారీ షాకిచ్చిన త్రిష.. చిరంజీవి, కమల్ కోసం ఇంత చేసిందా?
TeluguStop.com
హీరోయిన్ త్రిష( Trisha ) గురించి అందరికీ తెలిసిందే.త్రిష ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతోంది.
సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా చిన్న హీరో పెద్ద హీరో అని సంబంధం లేకుండా వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమా అవకాశాలను అందుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.
దానికి తోడు ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలు అన్నీ కూడా వరసగా హిట్ అవుతుండడంతో అన్ని భాషల్లోనూ ఏక కాలంలో నటిస్తున్నారు.
"""/" /
ప్రస్తుతం అజిత్ తో విడామయూర్చి,( Vidamayurchi ) కమల్ హాసన్ టతో థగ్ లైఫ్,( Thug Life ) చిరంజీవి తో విశ్వంభర,( Vishwambhara ) మోహన్ లాల్ తో కలిసి రామ్( Ram ) లాంటి వరుస సినిమాలలో నటిస్తోంది.
అయితే ఇందులో అజిత్ నటిస్తున్న విడా మయూర్చి షూటింగ్ అంతకంతకూ లేట్ అవుతూ వస్తోంది.
దీంతో ఈ సినిమాకు కేటాయించిన డేట్స్‌ని విశ్వంభర, థగ్ లైఫ్ చిత్రాలకు ఉపయోగించేస్తోంది.
దీంతో విడామయర్చి చిత్రానికి షాక్ తగిలినట్లయింది. """/" /
అయితే ఇదంతా దర్శకుడు మణిరత్నం చేసిన పని అనుకోవచ్చు.
ఎందుకంటే పొన్నియన్ సెల్వన్ మూవీలో కుందవై పాత్ర ఇచ్చి త్రిషకి మళ్లీ లైఫ్ ఇచ్చాడు.
దీంతో ఇప్పుడు ఈమె ఊపిరిసలపనంత బిజీగా మారిపోయింది.టైమ్ అంటే ఇదే మరి.
ఇకపోతే త్రిష విషయానికి వస్తే ఒకప్పుడు తెలుగు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న త్రిష ఆ తర్వాత తమిళ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అక్కడ స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది.
ఆ తర్వాత ఇప్పుడు తెలుగు అలాగే హిందీలోకి మళ్లీ రీఎంట్రీ ఇచ్చి అన్ని ఇండస్ట్రీలో అన్ని భాషల్లో బిజీ బిజీ అవ్వడానికి ప్రయత్నిస్తుంది.
డైట్ లేకుండా బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే ఈ పొడి మీకోసమే!