సంతూర్ యాడ్ లో నటించింది ఈ టాప్ హీరోయినా?

హీరోయిన్ తృప్తి దిమ్రి( Tripti Dimri ) గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.

యానిమల్ సినిమాతో( Animal Movie ) యువతలో అలజడి సృష్టించి తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుంది.

ఈ ఒక్క సినిమాతో నేషనల్ వైడ్ గా రాత్రికి రాత్రి క్రేజ్ ను సొంతం చేసుకుంది ఈ బ్యూటీ.

అయితే యానిమల్ సినిమా అనంతరం వరస సినిమాల ఆఫర్లతో చాలా బిజీ అయిపోయింది ఈ ముద్దు గుమ్మ.

ఇటీవలే కామెడీ బోల్డ్ మూవీ బ్యాడ్ న్యూజ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న అనంతరం " విక్కీ విద్యా కావో వాలా వీడియో"( Vicky Vidya Ka Woh Wala Video ) సినిమా తో కూడా మెప్పించింది.

ఇక ఈ సినిమాలో రాజ్ కుమార్ రావు,( Rajkumar Rao ) తృప్తి దిమ్రి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ సినిమా అక్టోబర్ 11 విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ సొంతం చేసుకుంది.

"""/" / ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగానే 'మాషబుల్ ఇండియా ది బాంబే జర్నీ' అనే టాక్ షో కి గెస్టులుగా వెళ్లారు తృప్తి దిమ్రి, రాజ్ కుమార్ రావ్.

ఇక 'మాషబుల్ ఇండియా ది బాంబే జర్నీ' టాక్ షోలో భాగంగా లేటెస్ట్ ఎపిసోడ్ లో రాజ్ కుమార్ రావు కారు డ్రైవ్ చేస్తూ ఉంటే పక్కనే తృప్తి దిమ్రి కూర్చోండి వెనుక సీట్లో ఆ ప్రోగ్రాం హోస్ట్ కూర్చొని క్యూస్షన్స్ అడగడం మొదలుపెట్టాడు.

ఈ తరుణంలోనే తృప్తి దిమ్రి తాను సంతూర్ యాడలో( Santoor Ad ) నటించినట్లు చెప్పుకొచ్చింది.

మొదటిసారి మీరు ఎప్పుడు వచ్చారు అని హోస్ట్ తృప్తి దిమ్రిని అడగగా.

"నేను ముంబైకి( Mumbai ) మొదటిసారిగా 2016లో వచ్చాను.అప్పుడు తనకు సంతూర్ యాడ్ ఛాన్స్ వచ్చిందని.

, అందుకే ముంబైకి వచ్చాను" తెలియజేసింది. """/" / దీంతో వెంటనే రాజ్ కుమార్ రావు అంటే "నువ్వు ముందు తల్లిగా నటించావా" అంటూ అడిగాడు.

దానికి తృప్తి సమాధానం ఇస్తూ.అవును నేను తల్లిగా చేశాను అంటూ నవ్వుతూ చెప్పింది.

అలాగే "నేను షూటింగ్ గురించి చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నాను.నాకు సినీ పరిశ్రమలో ఎలాంటి పాత్రలో అయినా పని చేయడం సంతోషంగా ఉంది.

నేను మాద్ ఐలాండ్, మెరైన్ డ్రైవ్‌లో కూడా యాడ్ కోసం షూటింగ్ చేశాను.

ముంబైకి కొత్తగా వచ్చాను కాబట్టి ఎక్కువ తిరిగాను.ఇదిలా ఉంటే, " ప్రస్తుతం సంతూర్ యాడ్ లో నటించినట్లు తృప్తి దిమ్రి చెప్పిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.

అయితే ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్లో సినిమాలు చేయడానికి కంటే ముందు పలు యాడ్స్ లో నటించినట్లు తెలుస్తుంది.

ఫ్రీ డేటా, ఫ్రీ ఓటీటీ ఇచ్చినా అంబానీకి నో క్రెడిట్.. ఇది కదా కలికాలం అంటే?