ఆ నిర్మాతతో ప్రేమ నిజమేనంటున్న ప్రముఖ నటి.. పెళ్లి ఎప్పుడంటే?
TeluguStop.com
సాధారణంగా సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలకు సంబంధించిన డేటింగ్ వార్తలు వినిపిస్తూనే ఉంటాయి.అయితే కొందరు మొదట్లోనే అఫీషియల్ గా వెయిటింగ్ చేస్తున్నట్టు ప్రకటించినప్పటికీ మరికొందరు మాత్రం అలాంటిదేమీ లేదు అంటూ కప్పిపుచ్చుకుంటూ ఉంటారు.
తగా చిన్ని ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతోమంది మొదట్లో డేటింగ్ వార్తలను కొట్టి పడేసిన చాలామంది ఆ తర్వాత అదే విషయాన్ని నిజం చేస్తూ ఒకటైన విషయం తెలిసిందే.
లేటుగా అయినా కూడా కొందరు వారి డేటింగ్ విషయాలను తెలుపుతూ ఉంటారు.మరికొందరు చిన్న చిన్న వాటి ద్వారా హింట్లు ఇస్తూ ఉంటారు.
ఇది ఇలా ఉంటే తాజాగా బాలీవుడ్ నటి ఒక నిర్మాత తో డేటింగ్ లో ఉన్నట్టుగా అఫీషియల్ గా ప్రకటించింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.బాలీవుడ్ నటి తృప్రి డిమ్రీ డేటింగ్ లో ఉంది అంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
తృప్రి డిమ్రీ, ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ సోదరుడు నిర్మాత కర్నేష్ శర్మతో డేటింగ్ లో ఉన్నట్టుగా వార్తలు జోరుగా వినిపిస్తూనే ఉన్నాయి.
అయితే తాజాగా ఈ వార్తలపై స్పందించింది తృప్రి డిమ్రీ.తాను నిర్మాత కర్నేష్ శర్మతో డేటింగ్ లో ఉన్నట్టుగా ఆమె అధికారికంగా ప్రకటించింది.
తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా ఆమె తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ మై లవ్ అంటూ ఎమోజీలను జత చేసింది.
"""/"/
న్యూ ఇయర్ సందర్భంగా వారి లవ్ ని అఫీషియల్ గా ప్రకటించింది ఈ ముద్దుగుమ్మ.
చాలామంది ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఈ జంట కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.
కాగా నటి తృప్రి డిమ్రీ 2020లో విడుదల అయిన బుల్బుల్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.
ఈ సినిమాను కర్నేష్ తన బ్యానర్ లో తెరకెక్కించారు.ఇక అప్పటి నుంచి వీరిద్దరి మధ్య ఏదో ఉంది అంటూ వార్తలు వినిపించగా కొద్ది రోజులకు వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారు అంటూ ఊహాగానాలు వినిపించాయి.
కానీ ఈ జంట వారి రిలేషన్షిప్ గురించి ఎప్పుడూ బహిరంగంగా ప్రకటించలేదు.ఇటీవలే తృప్రి డిమ్రీ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు సదరు యాంకర్ ఎవరితో అయిన డేటింగ్ చేస్తున్నారా అని ఆమెను ప్రశ్నించగా.
ఇప్పుడే మా ప్రయాణం మొదలైంది ఇది మాత్రమే ఇప్పుడు చెప్పగలను.కానీ నా పెళ్లికి ఇంకా 7 లేదా 8 సంవత్సరాలు పడుతుంది అని ఆమె తెలిపింది.
ఫొటోలు వైరల్: భర్త బాగుండలంటూ అట్లతద్ది పూజ చేసిన స్నేహరెడ్డి..