ప్రవాసీ భారతీయ దివస్ 2025కు ముఖ్య అతిథి ఎవరంటే?
TeluguStop.com
జనవరి 8 నుంచి 10 వరకు ఒడిషా రాజధాని భువనేశ్వర్‌లో జరగనున్న 18వ ప్రవాసీ భారతీయ దివస్‌కు( 18th Pravasi Bharatiya Divas ) ముఖ్య అతిథిగా ట్రినిడాడ్ అండ్ టుబాగో( Trinidad And Tobago ) అధ్యక్షురాలు క్రిస్టెన్ కాంగాలూ( President Christine Kangaloo ) హాజరుకానున్నారు.
ఈ కార్యక్రమంతో పాటు చందకలోని గొడిబారి ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులతోనూ ఆమె ముఖాముఖి నిర్వహించనున్నారు.
ఒడిషా సీఎం మోహన్ మాఝీ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ప్రవాసీ భారతీయ దివస్‌కు ప్రధాని నరేంద్ర మోడీతో( PM Narendra Modi ) పాటు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ హాజరుకానున్నారు.
ఇదే కార్యక్రమంలో ప్రవాసీ భారతీయ ఎక్స్‌ప్రెస్‌ను నరేంద్రమోడీ ప్రారంభించనున్నారు. """/" /
ప్రవాసీ భారతీయ దివస్ నేపథ్యంలో భువనేశ్వర్ నగరంలో( Bhubaneswar ) భదత్రా చర్యలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి భారత్ సహా విదేశాల నుంచి దాదాపు 7 వేల మందికి పైగా అతిథులు హాజరుకానున్నారు.
ఇప్పటికే 2748 మంది నమోదు చేసుకున్నారు.అతిథులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు గాను భువనేశ్వర్, కటక్ నగరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు సుందరీకరణ పనులను చేపడుతున్నారు.
అతిథులను అలరించేందుకు స్ట్రీట్ ఫెస్టివల్, ఏకామ్ర ఉత్సవ్, గిరిజన జాతరలు వంటి వాటిని నిర్వహించనున్నారు.
రాజా రాణి సంగీత ఉత్సవం, ఒడిస్సీ నృత్యం, ముక్తేశ్వర్ డ్యాన్స్ ఫెస్టివల్ వంటి కార్యక్రమాల ద్వారా ఒడిషా సంస్కృతి, వారసత్వాన్ని ప్రదర్శించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
"""/" /
కాగా.జాతిపిత మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి 1915 జనవరి 9న తిరిగి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని భారత ప్రభుత్వం 2003 నుండి ప్రతి ఏటా ప్రవాసీ భారతీయ దివస్‌ను జరుపుతోంది.
ప్రవాస భారతీయులతో సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా భారతదేశ అభివృద్ధికి ఎన్ఆర్ఐలు చేసిన కృషికి గుర్తుగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు.
గేమ్ ఛేంజర్ బోరింగ్…. టైం వేస్ట్ సినిమా…. ఉమైర్ సంధు షాకింగ్ రివ్యూ?