షూటింగ్ సెట్ కు వచ్చి కొట్టేవాడన్న త్రినయని నటి.. పెళ్లిపై అభిప్రాయం ఇదేనంటూ?

ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ లో ఒకటైన జీ తెలుగు ఛానల్ లో ప్రసారమయ్యే త్రినయని సీరియల్( Trinayani Serial ) కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.

బుల్లితెరపై మంచి రేటింగ్ లను సొంతం చేసుకుంటున్న సీరియల్స్ లో ఈ సీరియల్ కూడా ఒకటనే సంగతి తెలిసిందే.

త్రినయని సీరియల్ నటి అనూష( Actress Anusha ) మాట్లాడుతూ తనది వైజాగ్ అని అన్నారు.

2017లో హైదరాబాద్ కు వచ్చానని అప్పుడు సినిమాలలో ప్రయత్నించానని ఆమె తెలిపారు.2019లో సీరియళ్లలో ప్రయత్నించి చివరకు సీరియళ్లలో కెరీర్ ను మొదలుపెట్టానని ఆమె అన్నారు.

జెమిని ఛానల్ లో మట్టి గాజులు సీరియల్ లో, జీ తెలుగులో మీనాక్షి సీరియల్ లో, చదరంగం, లక్ష్మీ కళ్యాణం సీరియల్స్ లో కూడా చేశానని ఆమె తెలిపారు.

త్రినయనిలో తొలిసారి నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో నటించానని అనూష అన్నారు.

నా పాత్రను చంపేయాలని చెబుతున్నారని ఆమె చెప్పుకొచ్చారు. """/" / సెట్ లో అందరూ బాగానే ఉంటారని ఆమె అన్నారు.

శ్రీసత్యకు బదులుగా తాను ఈ సీరియల్ లోకి వచ్చానని అనూష కామెంట్స్ చేశారు.

సుమన రోల్ తనకు మంచి పేరు తెచ్చిపెట్టిందని ఆమె పేర్కొన్నారు.సీరియళ్లలో మంచి పాత్రలు దక్కాయని అనూష తెలిపారు.

పెళ్లి గురించి ఆలోచన లేదని అర్థం చేసుకునే అబ్బాయి కావాలని కోరుకుంటున్నానని ఆమె చెప్పుకొచ్చారు.

"""/" / ఈ ఇండస్ట్రీలో ఉండేవాళ్లు రిలేషన్ లో ఉండాలంటే అవతలి వ్యక్తికి అండర్ స్టాండింగ్ ఉండాలని అనూష చెప్పుకొచ్చారు.

నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండేదని ఆమె భర్త అర్థం చేసుకునేవారు కాదని లొకేషన్ కు వచ్చి కొట్టేవారని అనూష కామెంట్లు చేశారు.

ఆ అమ్మాయి ఎంత ఇబ్బందులను అనుభవించిందో నేను చూశానని ఆమె చెప్పుకొచ్చారు.అనూష చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మెడ న‌లుపుతో వ‌ర్రీ వ‌ద్దు.. ఇవి ట్రై చేయండి..!