నిర్మలా సీతారామన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తృణమూల్ కాంగ్రెస్!
TeluguStop.com
దేశవ్యాప్తంగా బిజేపి వేగంగా విస్తరిస్తుంది.ఇది అటు ప్రాంతీయ పార్టీలకు ఇటు జాతీయ పార్టీలకు ఏమాత్రం రుచించడం లేదు.
అందుకే కోవిడ్ టైంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన మాన్ సూన్ సెషన్స్ ను గట్టిగా వాడుకోవాలని ప్రతిపక్షాలు సిద్ధమైయ్యాయి.
అందులో భాగంగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ఒకరు కేంద్ర మంత్రి నిర్మల్ సీతారామన్ పై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు మరి ఆతరువాత జరిగిన కథేంటో ఇప్పుడు చూద్దాం.
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగత్ రాయ్ ఈరోజు జరిగిన లోక్‌సభ సెషన్స్ లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌పై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు.
సీనియర్ సభ్యుడైన సౌగత్ రాయ్ ఇలాంటి కామెంట్స్ చేయడం పై బిజేపి నేతలు విరుచుకుపడ్డారు.
ఈ వ్యాఖ్యలను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తప్పుపట్టారు అంతేకాకుండా ఈ వ్యాఖ్యలను వెంటనే రికార్డ్ నుండి తొలగించాలని ఇలాంటి వ్యాఖ్యాలు చేసినందుకు గాను ఎంపీ సౌగత్ రాయ్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
అయినా ఒక స్త్రీ వేషధారణపై కామెంట్లు చేయడం ఎంతమాత్రం సరికాదని ఆయన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీకి సూచించారు.
ఇక తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగత్ రాయ్ చేసిన వ్యాఖ్యలు మహిళలను కించపరిచే విధంగా ఉండడం వల్ల వాటిని రికార్డ్స్ నుండి తొలగిస్తున్నట్లు చైర్ పర్సన్ అభిప్రాయపడ్డారు.