చదువుల తల్లి సావిత్రీబాయికి ఘన నివాళులు
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా: చదువుల తల్లి సావిత్రీబాయి పూలే 194 వ జయంతి సందర్భంగా,వేములవాడ పట్టణ బీసీ సాధికారిత సంఘం కార్యాలయం లో సావిత్రీబాయి పూలే ఫోటోకు పూలమాలలు వేసి,బీసీ సాధికారిత సంఘం సభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు.
చదువులతల్లి సావిత్రి బాయి పూలే స్త్రీ విద్యకోసం తన జీవితాన్ని ధారపోసిన మహానీయురాలు సావిత్రీబాయి పూలే అని ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీసీ సాధికారిత సంఘం కన్వీనర్ అన్నారు.
స్త్రీ జాతి ఔన్నత్యం కోసం,అణచివేతకు గురైన కులాల స్వేచ్చ కోసం చేసిన త్యాగాలు మరువలేనివనీ నరేందర్ అన్నారు.
మహిళా సాధికారిత కోసం సావిత్రీబాయి పూలే ఎంతగానో శ్రమించారని, భారత దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు కావడం మహిళలే కాకుండా ,
ఈ దేశం గర్వించదగ్గ విషయం అని నరేందర్ అన్నారు.
మహిళలు వంటింటికే పరిమితం కాకుండా,విద్యను అభ్యసించాలని,పురుషులతో సమానంగా ఉద్యోగాలుచేయాలని, రాజకీయంగా రాణించాలని, అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేసిన గొప్ప వ్యక్తి సావిత్రీబాయి పూలే అని కొనియాడారు.
నాటి సావిత్రీబాయి పూలే కృషి కారణంగా నేడు మహిళలు అన్ని రంగాలలో ముందుకు వెళ్తున్నారన్నారు.
ముఖ్యంగా ప్రభుత్వాలు మహిళలకు రాజకీయాల్లో రిజర్వేషన్లు, విద్యా,ఉద్యోగాలలో సరియైన ప్రాతినిథ్యం కల్పించడంతో పాటుగా,మహిళలకు ప్రత్యేకముగా విశ్వ విద్యాలయాలు,డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీలు, గురుకుల పాట శాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలు వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ఈకార్యక్రమంలో బీసీ సాధికారిత సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తూపూకారి సత్తయ్య, ఇళ్ళందుల వెంకటేష్, కౌన్సిలర్స్ మారం కుమార్, కొండ కనుకయ్య,కొండ నర్సయ్య, సంఘ నాయకులు గోపు బాలరాజు,కనపర్తి సుధాకర్, మైలార ము రాము,సి హెచ్.
రామస్వామి గౌడ్,కుంభం రవీందర్, మ్యానా రాజేష్, చేను హేలపతి, ఉయ్యాల భూమయ్య, మంతెన దుర్గేష్,బర్గుపెల్లి రామస్వామీ లతో పాటుగా పలువురు సంఘ సభ్యులు పాల్గొన్నారు.
గేమ్ ఛేంజర్ లో చరణ్ ట్రిపుల్ రోల్ లో కనిపిస్తారా.. వైరల్ వార్తల్లో నిజమెంత?