ప్రజా యుద్ధనౌకకు ఘన నివాళులు – జడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు

రాజన్న సిరిసిల్ల జిల్లా :ప్రజా గాయకుడు తాడిత పీడిత కులాలను ఏకం చేసి చైతన్యపరిచిన గద్దర్ అని జడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు అన్నారు.

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సోమవారం స్థానిక జెడ్పిటిసి కార్యాలయం ముందు గద్దర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహా బోధి పాఠశాలను ఏర్పాటు చేసి పేద విద్యార్థులను చదివించిన మహానుభావుడని తన ఆటపాటలతో తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలను ఊగించిన విప్లవ కళాకారుడని కొనియాడారు.

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గా తన జీవితమంతా ఆటపాటలతో సాగిందని పేర్కొన్నారు.

తన వెన్నుముకల తూట ఉన్నప్పటికీ కాలుకు గజ్జ కట్టాడని ఆయన సేవలు తెలంగాణలో మరువలేనివని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ పిల్లి రేణుక, బిఆర్ఎస్ ఉద్యమకారుడు అందే సుభాష్, పట్టణ శాఖ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి,సుధాకర్ రావు, గోష్కదాసు తదితరులు పాల్గొన్నారు.

ఈ న్యాచురల్ ఫేస్ వాష్ ను వాడితే స్పాట్ లెస్ స్కిన్ మీ సొంతమవుతుంది!