మాదిగ అమరవీరులకు ఘన నివాళి…!

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఉద్యమంలో అసువులు బాసిన మాదిగ అమర వీరుల స్ఫూర్తితో మాదిగలు ముందుకు సాగాలని మహాజన సోషలిస్ట్ పార్టీ ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్చార్జి కందుకూరి సోమన్న మాదిగ అన్నారు.

బుధవారం తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో మహాజన సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మాదిగ అమర వీరుల వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాదిగ అమరుల చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్సీలను ఏబిసిడిలుగా వర్గీకరించాలని మందకృష్ణ మాదిగ నాయకత్వంలో జరిగిన పోరాటంలో అమరులైన పొన్నాల సురేంద్ర మాదిగ,దామోదర్ మాదిగ,మహేష్ మాదిగ, భారతి మాదిగల త్యాగం వెలకట్టలేనిది కొనియాడారు.

నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్.రాజశేఖర్ రెడ్డి హయాంలో ఎస్సీ వర్గీకరణపై తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసనగా గాంధీభవన్ పై దాడి చేసిన ఘటనలో ప్రమాదవశాత్తు కాలి తీవ్రగాయాలతో మర్చి 1వ తేదీన మరణించడం జరిగిందని, వారి ఆశయ సాధనకై ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని,తప్పకుండా ఎస్సీ వర్గీకరణ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

వర్గీకరణ సాధించినప్పుడు మాత్రమే మనం అమరవీరులకిచ్చే నిజమైన ఘన నివాళిగా పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సామాజిక తెలంగాణ మహాసభ రాష్ట్ర కన్వీనర్ కొత్తగట్టు మల్లయ్య, మహాజన సోషలిస్ట్ పార్టీ ఉమ్మడి నల్గొండ జిల్లా కమిటీ సీనియర్ నాయకులు కందుకూరి శ్రీను మాదిగ,జంబుద్వీప జన సమితి రాష్ట్ర కన్వీనర్ పత్తేపురం యాదగిరి, గోపాల్ దాసు రంజిత్, గద్దల అనుదీప్,బోడ వెంకట్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

రీల్ చేసి ఫేమస్ అవుదామనుకున్నాడు.. కానీ, పోలీసులు దెబ్బకు దిమ్మ తిరిగిందిగా