అప్పుడు ట్యాక్సీ డ్రైవర్.. ఇప్పుడు యూకే యూనివర్సిటీలో సీటు.. ఈ యువతి సక్సెస్ కు హ్యాట్సాఫ్ అనాల్సిందే

ప్రతి ఒక్కరి జీవితంలో వేర్వేరు సందర్భాల్లో ఊహించని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి.ఎన్ని సవాళ్లు ఎదురైనా కష్టపడితే కొన్ని సందర్భాల్లో సులభంగానే సక్సెస్ దక్కుతుంది.

పేదరికాన్ని జయించి కొంతకాలం ట్యాక్సీ డ్రైవర్ గా పని చేసి ప్రస్తుతం యూకే యూనివర్సిటీలో( UK University ) సీటు సంపాదించుకున్న కిరణ్ కుర్మావర్( Kiran Kurmawar ) సక్సెస్ స్టోరి గురించి ఎంత చెప్పినా తక్కువేనని చెప్పవచ్చు.

మహారాష్ట్ర రాష్ట్రంలోని గడ్చిరోలి జిల్లాలోని రేగుంట అనే గ్రామానికి చెందిన కిరణ్ కుర్మావర్ కు చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి.

ఈమె తండ్రి ట్యాక్సీ డ్రైవర్ గా( Taxi Driver ) పని చేసేవారు.

కేవలం 500 మంది జనాభా నివశించే చిన్న గ్రామంలో ఆమె నివశించేవారు.కిరణ్ కుర్మావర్ కు ఇద్దరు అక్కలు కాగా ఇద్దరు అమ్మాయిలకు పెళ్లి చేసిన తండ్రి చివరి అమ్మాయిని మాత్రం బాగా చదివించాలని అనుకున్నాడు.

కిరణ్ కుర్మావర్ ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ, ఎం.ఏ ఎకనామిక్స్ పూర్తి చేశారు.

ఢిల్లీలో కిరణ్ కుర్మావర్ చిన్న జాబ్ లో చేరిన సమయంలో తండ్రికి యాక్సిడెంట్ జరగడంతో కుటుంబ భారం ఈమెపై పడింది.

"""/" / కిరణ్ కుర్మావర్ ప్రతిరోజూ 75 కిలోమీటర్ల దూరం ట్యాక్సీ నడిపేవారు.

కొండ ప్రాంతపు రహదారిలో ట్యాక్సీ నడపడం సులువు కాకపోయినా ఆమె మాత్రం ఎంతో కష్టపడి నడిపేవారు.

నక్సలైట్ల భయం ఉన్నా భయపడకుండా ఆమె ముందడుగులు వేశారు.తను ట్యాక్సీ నడపడంతో పాటు ఇద్దరు డ్రైవర్లను నియమించుకున్నారు.

కొన్ని నెలల తర్వాత తండ్రి కోలుకోవడంతో కిరణ్ కుర్మావర్ చదువుపై మళ్లీ దృష్టి పెట్టారు.

"""/" / విదేశీ యూనివర్సిటీలలో చదువుకోవడం కోసం ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడంతో పాటు వాటి కోసం కిరణ్ కుమార్ ప్రిపేర్ అయ్యేవారు.

ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి యూకేలోని ప్రముఖ యూనివర్సిటీలో కిరణ్ కుర్మావర్ సీటు సాధించి ఆమె సక్సెస్ స్టోరీతో( Kiran Kurmawar Success Story ) అందరినీ ఫిదా అయ్యేలా చేస్తున్నారు.

గేమ్ చేంజర్ కలెక్షన్స్ చూస్తే మతి పోతుంది…