టీఎస్పిఎస్సిలో ఫలితాల్లో మెరిసిన గిరిజన ఆణిముత్యం
TeluguStop.com
సూర్యాపేట జిల్లా:నేరేడుచర్ల మండలం పులగంబండ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని జగనాతండాకు చెందిన అంగోతు రవీందర్ నాయక్, అంబాలీ కుమార్తె అంగోతు శాంతి బుధవారం ప్రకటించిన
టిఎస్పిఎస్సి ఫలితాల్లో 14 వ, ర్యాంకుతో మల్టిజోన్ జనరల్ జూనియర్ లెక్చరర్ ఉద్యోగంతో పాటు గతంలో గురుకుల జేఎల్ ఫలితాల్లో స్టేట్ 26వ ర్యాంకు,పిజిటి 30 ర్యాంకు,టీజీటీ కూడా ర్యాంకు పొంది మరో 3 ఉద్యోగాలు కూడా సాధించింది.
కష్టపడి సాధన చేసి చదివితే ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం సులభమని ఆమె తెలిపారు.
మొత్తం నాలుగు ఉద్యోగాలు సాధించిన అంగోతు శాంతిని గ్రామస్తులతో పాటు పలువురు అభినందించారు.
తండేల్ సినిమాకి పోటీ గా వస్తున్న తమిళ్ స్టార్ హీరో…ఈ పోటీలో ఎవరు సక్సెస్ కొడుతారు..?