మహబూబాబాద్ తహసీల్దార్ పై గిరిజన రైతుల దాడి

మహబూబాబాద్ తహసీల్దార్ పై గిరిజన రైతులు దాడికి పాల్పడ్డారు.కోర్టు కాంప్లెక్స్ నిర్మాణం కోసం రెవెన్యూ అధికారులు సర్వే చేసేందుకు వెళ్లారు.

ఈ క్రమంలో సర్వే కోసం వచ్చిన రెవెన్యూ అధికారులు స్థానిక యువత, మహిళలు అడ్డుకున్నారు.

గిరిజనులకు, రెవెన్యూ సిబ్బంది మధ్య చెలరేగిన వాగ్వివాదం తీవ్ర ఘర్షణకు దారి తీసింది.

దీంతో తీవ్ర కోపోద్రిక్తులైన గిరిజన రైతులు తహసీల్దార్ పై రాళ్లతో దాడికి దిగారు.

ఈ దాడిలో ఎమ్మార్వోకు గాయాలు కావడంతో సిబ్బంది చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

అనంతరం తహసీల్దార్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రామ్ చరణ్ చిరుత సినిమాను మిస్ చేసుకున్న హీరో అతనేనా.. తెరవెనుక ఇంత జరిగిందా?