ప్రాణం తీసిన ట్రైయాంగిల్ లవ్ స్టోరీ.. తమిళనాడులో ఘటన
TeluguStop.com
ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఓ యువతి ప్రాణాలను బలి తీసుకుంది.తమిళనాడులో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
కోయంబత్తూర్ లోని ఇడయార్ పాలయంకు చెందిన మహిళ తన భర్త ప్రేమించిన యువతిని దారుణంగా హత్య చేసింది.
సుజై అనే వ్యక్తి ఏడాది క్రితం రేష్మను ప్రేమ పెళ్లి చేసుకున్నాడు.అయితే అంతకుముందే సుబ్బలక్ష్మీని ప్రేమించాడు.
తనను కాదని వేరొకరిని పెళ్లి చేసుకున్న సుజైతో సుబ్బలక్ష్మీ వాగ్వివాదానికి దిగింది.ఈ క్రమంలోనే తన భర్తను వదిలి వెళ్లాలని రేష్మ గొడవకు దిగింది.
అది కాస్తా ముదరడంతో సుబ్బలక్ష్మీని కత్తితో పొడిచి హత్య చేసింది రేష్మ.అనంతరం సుజై, రేష్మ పరార్ అయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.అనంతరం నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
భారతీయులకు శుభవార్త .. ఇకపై అమెరికాలోనే హెచ్ 1 బీ వీసా రెన్యూవల్