లిక్కర్ పాలసీ కేసుపై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ

ఢిల్లీ లిక్కర్ పాలసీ( Delhi Liquor Policy ) మనీలాండరింగ్ కేసుపై రౌస్ అవెన్యూ కోర్టులో( Rouse Avenue Court ) విచారణ జరిగింది.

ఈ మేరకు జైలులో న్యాయవాదులను కలిసేందుకు అదనపు సమయం కావాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్( CM Arvind Kejriwal ) న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

ఈ క్రమంలోనే వారానికి ఐదు సార్లు లాయర్లను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కేజ్రీవాల్ కోర్టును కోరారు.

అయితే అందరికీ ఉన్నట్లుగానే కేజ్రీవాల్ కూ నిబంధనలు ఉంటాయని ఈడీ తెలిపింది.ఈ క్రమంలో ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం కేజ్రీవాల్ పిటిషన్ పై తీర్పును రిజర్వ్ చేసింది.

ఈ నేపథ్యంలోనే ఈ నెల 9న రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును వెలువరించనుంది.

బాలయ్య సినిమాకు పోటీగా ప్రభాస్ సినిమా రిలీజ్ కానుందా.. రిలీజయ్యేది అప్పుడేనా?