రోడ్డుకు ఇరువైపులా ప్రమాదకరంగా చెట్లు…సీపీఎం ఆధ్వర్యంలో శ్రమాదానం

యాదాద్రి భువనగిరి జిల్లా: రామన్నపేట-అమ్మానబోలు ప్రధాన రహదారి వెంట ఉన్న చెట్లను తొలగించి ప్రమాదాలను అరికట్టడంలో ఆర్ అండ్ బి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సిపిఎం రామన్నపేట మండల కమిటీ సభ్యుడు మేడి గణేష్,దుబ్బాక సీపీఎం గ్రామ శాఖ కార్యదర్శి గుండాల ప్రసాద్ అన్నారు.

సోమవారం దుబ్బాక-రామన్నపేట మధ్య సిపిఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న కంపచెట్లను తొలగించి శ్రమదానం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాన రహదారి వెంట ఇరువైపులా చెట్ల మూలంగా రోడ్డు సరిగా కనబడకపోవడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయని, గతంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఆర్ అండ్ బి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

సిపిఎం ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా గ్రామ శాఖ కార్యకర్తలతో శ్రమదానం నిర్వహించామన్నారు.రామన్నపేట నుండి అమ్మనబోలు రూటు వరకు ప్రమాదకరంగా మారిన చెట్లను వెంటనే తొలగించాలని,లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం దుబ్బాక గ్రామ శాఖ నాయకులు గట్టు నరసింహ,గుండాల సుందర్,కంబాలపల్లి మత్య్సగిరి,గట్టు సుందర్, పుట్టల ఉదయ్, కంబాలపల్లి శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

30 రోజులు నిద్ర లేదు నరకం అనుభవించాను.. సాయి పల్లవి ఎమోషనల్ కామెంట్స్!