చెరకు సాగులో కణుపుల శుద్ధి.. మెరుగైన సస్యరక్షక పద్ధతులు..!

చెరకు( Cane ) ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో రెండవ స్థానంలో ఉంది.చెరుకు సాగుకు దీర్ఘకాలిక వేడి వాతావరణం, నీటిపారుదల సౌకర్యం అవసరం.

చెరుకు పంటకు ఎంత ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే అంత దృఢంగా చెరుకు మొక్కలు పెరుగుతాయి.

నేల యొక్క PH విలువ 6 నుండి 7.5 వరకు ఉండే నల్లరేగడి నేలలు, బంక నేలలు అనుకూలంగా ఉంటాయి.

డ్రిప్ విధానం ద్వారా నీటిని అందిస్తే శ్రమ తగ్గుతుంది.వేసవికాలంలో లోతు దిక్కులు దున్ని, రోటవేటర్ తో నేలను పొడిగా, వదులుగా చేసుకోవాలి.

మొదటి దుక్కులో పొలం యొక్క సామర్ధ్యాన్ని బట్టి దాదాపు 10 టన్నుల పశువుల ఎరువు( Cattle Manure ) వేసి కలియదున్నాలి.

తర్వాత దుక్కిలో రెండు లేదా మూడు టన్నుల కోళ్ళ ఎరువు, ఓ రెండు టన్నుల వర్మి కంపోస్ట్ ఎరువులు కలిపి ఉండాలి.

అంతేకాకుండా వీటితోపాటు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 100 కిలోలు, మ్యూరియెట్ ఆఫ్ పొటాష్( Muriate Of Potash ) 50 కిలోలు ఒక ఎకరం పంటకు అవసరం అవుతాయి.

"""/" / ఒక ఎకరానికి దాదాపు 25 వేల కణుపులు అవసరం.ఈ కణుపులను 50 గ్రాముల కార్బెండిజం 50%WP, మలాథియన్( Malathion ) 50%EC 200 మిల్లీలీటర్లు, ఒక కిలో యూరియాను 100 లీటర్ల నీటిలో బాగా కలిపి అందులో కణపులను 15 నిమిషాల పాటు నానబెట్టాలి.

ఇక గడ్డి షూట్ తెగులు చెరుకు పంటను ఆశించకుండా ఒక గంట పాటు 50 డిగ్రీస్ సెంటీగ్రేడ్ వద్ద ఆవిరితో కణుపుల ను శుద్ధి చేసుకోవాలి.

ఇక కణుపుల మధ్య 1.5 అడుగుల దూరం ఉండేలా నాటుకోవాలి.

నాటే సమయంలో నాకు ఆరు కిలోల క్లోరాంత్రనిలిప్రోల్ 0.4%GR గుళికలు వేస్తే లద్దే పురుగులను అరికట్టవచ్చు.

"""/" / ఇక కణపులకు సూర్యరశ్మి తగలకుండా భూమి లోపలికి నాటుకోవాలి.నాటిన ఒక రెండు మూడు రోజుల తర్వాత 400 లీటర్ల నీటిలో 600 గ్రాముల మేథ్రిబుజిన్ 70 %WP+ 2,4- డి డైమిథైల్ అమైన్ సాల్ట్ 58%SL ను లీటర్ నీటితో కలిపి పిచికారి చేస్తే కలుపు మొక్కలను చాలావరకు అరికట్టవచ్చు.

వైరల్ వీడియో: సఫారీ జీపుపై దాడికి పాల్పడిన ఏనుగు.. చివరకు..