వ్యాయామం చేస్తున్నప్పుడు ఛాతిలో ఇలాంటి నొప్పి వస్తే.. వెంటనే ఇలా చేయండి..!
TeluguStop.com
ఈ మధ్యకాలంలో గుండెపోటు( Heart Attack ) మరణాలు దాదాపు చిన్నవారు పెద్దవారు అనే తేడా లేకుండా అందరిలో కనిపిస్తున్నాయి.
ఈ మధ్యకాలంలో ఎక్కువగా చిన్న వయసు వారు గుండెపోటుతో మృతి చెందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
యువత లో గుండెపోటు రావాడం చాలా మందిని కలవరు పెడుతుంది.ముఖ్యంగా జిమ్ లో వ్యాయామం చేస్తూ ఉన్నప్పుడు గుండెపోటు వచ్చి చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది.
జిమ్ లో వ్యాయామం చేస్తున్న సమయంలో గుండెపోటు వచ్చే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి.
ఆ సంకేతాలు కనిపించగానే జాగ్రత్త పడాలని, వీలైనంత త్వరగా వైద్యుల వద్దకు వెళ్లాలని నిపుణులు చెబుతున్నారు.
"""/" /
వ్యాయామం చేస్తున్నప్పుడు గుండె పోటు వచ్చే ముందు సంకేతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వ్యాయామం చేస్తున్నప్పుడు గుండెపోటు రావడానికి ముఖ్యమైన కారణాలలో ఇవి ఖచ్చితంగా ఉన్నాయి.కదలకుండా ఉండే జీవనశైలి, ధూమపానం, మద్యం సేవించడం, వ్యాయామం చేయకపోవడం, అధిక రక్తపోటు( High Blood Pressure ), రక్తంలో అధిక చక్రస్థాయి, అధిక కొలెస్ట్రాల్( Cholestrol ), ఉబకాయం, డయాబెటిస్, సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారాలు తినడం అలాంటి కరణాల వల్ల గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది.
వ్యాయామం చేస్తున్నప్పుడు ఇలా అనిపిస్తే కాస్త జాగ్రత్తగా ఉండడమే మంచిది. """/" /
ముఖ్యంగా చెప్పాలంటే ఆకస్మికంగా తీవ్రమైన చాతి నొప్పి గుండెపోటు వస్తుందని మొదటి సంకేతం అని వైద్యులు చెబుతున్నారు.
ఛాతి మధ్యలో భారంగా అనిపించడం తీవ్రమౌతుంది.వ్యాయామం చేస్తున్నప్పుడు( Exercise ) ఇలా అనిపించగానే వెంటనే వ్యాయామం చేయడం ఆపేసి వీలైనంత త్వరగా వైద్యుల ను సంప్రదించడం మంచిది.
ఇంకా చెప్పాలంటే వ్యాయామం చేస్తున్నప్పుడు ఊపిరి పీల్చుకోవడం కష్టంగా అవుతుంది.మీ గుండె మిమ్మల్ని హెచ్చరిస్తుందని అర్థం చేసుకోవచ్చు.
ఇలా అనిపించిన వెంటనే వ్యాయామం ఆపేసి విశ్రాంతి తీసుకోవాలి.వ్యాయామం చేస్తున్న సమయంలో తీవ్రమైన చాతి నొప్పి, ఛాతిలో అసౌకర్యం, శ్వాస ఆడక పోవడం లాంటి సంకేతాలు కనిపిస్తే మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందే.
ఇంకా చెప్పాలంటే విపరీతమైన చెమటలు పట్టడం, అనేది గుండె సరిగ్గా పనిచేయడం లేదని, హృదయ సంబంధిత సమస్యలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి.
1000 కోట్ల రూపాయలకు ఒకే ఒక్క మొగుడు ప్రభాస్.. తేజ సజ్జా కామెంట్స్ వైరల్!