రెచ్చిపోయిన డ్రగ్ మాఫియా: మెక్సికోలో కాల్పులు.. భారత సంతతి మహిళ మృతి

మెక్సికోలో డ్రగ్స్ మాఫియా రెచ్చిపోయింది.తులుమ్‌లోని కరేబియన్ తీరంలో వున్న రిసార్ట్‌లో దుండగులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు విదేశీ పర్యాటకులు మరణించారు.

వీరిలో ఒకరు భారత సంతతి యువతి.ఆమెను అంజలిగా గుర్తించినట్లు క్వింటానా రాష్ట్ర అధికారులు ధ్రువీకరించారు.

ఆమె పేరుతో వున్న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తులుమ్ తీరంలో విహరిస్తున్న ఫోటోను పోస్ట్ చేసింది.

అంజలి ఒక ట్రావెలర్.కాలిఫోర్నియాలోని శాన్‌జోస్‌లో ఆమె నివసిస్తున్నారు.

ఇక ఇదే ఘటనలో మరణించిన మరో విదేశీ మహిళను జర్మనీకి చెందిన జెన్నిఫర్ హెన్‌జోల్డ్‌గా గుర్తించారు.

అయితే ఆమె స్వస్థలం ఏది అన్న వివరాలను మాత్రం అధికారులు తెలియజేయలేదు.కాగా, తులుమ్ మెయిన్ స్ట్రిప్‌కు కుడివైపున వున్న ఒక ఫుడ్ కోర్ట్ వద్ద బుధవారం జరిగిన కాల్పుల ఘటనలో మరో ముగ్గురు విదేశీ పర్యాటకులు తీవ్రంగా గాయపడ్డారు.

వీరిలో ఇద్దరు జర్మన్ పురుషులు, ఒక డచ్ మహిళ వున్నారు.ప్రాసిక్యూటర్ల కథనం ప్రకారం.

ఈ ప్రాంతంలో డ్రగ్స్ విక్రయించే రెండు గ్రూపుల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి.

ఆ సమయంలో పర్యాటకులు రెస్టారెంట్‌లో భోజనం చేస్తుండగా ఈ కాల్పుల్లో చిక్కుకున్నారు.కాగా, డ్రగ్స్‌‌ గ్యాంగ్స్‌‌ ఉండే ఈ రాష్ట్రంలో ఎప్పుడూ హింస జరుగుతూనే ఉంటుంది.

ఇక్కడి డ్రగ్స్‌‌ గ్యాంగ్స్‌‌‌‌ను లేకుండా చేయడానికి 2006లో ప్రభుత్వం ఆర్మీని దింపింది.అప్పటి నుంచి ఇక్కడ సుమారు 3 లక్షల మంది ప్రజలు హత్యకు గురయ్యారు.

"""/"/ నాటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న చర్యల కారణంగా అమెరికా-మెక్సికో సరిహద్దులు పూర్తిగా మూసుకుపోయాయి.

దీంతో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరింత కష్టంగామారింది.ఈ పరిస్థితులు మెక్సికోలోని గ్యాంగుల మధ్య హింసకు కారణమవుతున్నాయి.

ఉన్న కాస్త అవకాశాలను చేజిక్కించుకునేందుకు డ్రగ్స్ ముఠాలు కొట్టుకుంటున్నాయి.స్థానిక పత్రిక మెలినియో ప్రచురించిన కథనం ప్రకారం గడిచిన 13 ఏళ్లలో ఎప్పుడు లేని స్థాయిలో 2020 మార్చి నెలలో ఘోర నరమేధం జరిగింది.

మరణించిన వారిలో మెజార్టీ వ్యక్తులకు ఏదో ఒక విధంగా నేర ముఠాలతో సంబంధాలున్నాయి.

అనకాపల్లి కి 29న సీఎం రమేష్…