హైదరాబాద్-విజయవాడ హైవేపై ట్రామా కేర్‌ సెంటర్‌:కలెక్టర్ సి.నారాయణరెడ్డి

నల్లగొండ జిల్లా:హైదరాబాద్- విజయవాడ 65వ,జాతీయ రహదారిపై కట్టంగూరు మండలం వామనగుండ్ల శివారులో ట్రామా కేర్ సెంటర్( Trauma Care Center ) ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని సిద్ధం చేయాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ సి.

నారాయణరెడ్డి ( Collector C Narayana Reddy )కట్టంగూర్ తహసిల్దార్ ప్రసాద్ ను ఆదేశించారు.

మంగళవారం ఆయన జాతీయ రహదారిపై కట్టంగూరు మండలం వామనగుండ్ల గ్రామ సరిహద్దుల్లో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటుకై స్థలాన్ని పరిశీలించారు.

3 రోజుల్లో గుర్తించిన స్థలంలో ప్రభుత్వ స్థలం,ఖాళీ స్థలాన్ని స్పష్టంగా విభజించి హద్దులు ఏర్పాటు చేయాలని,అంతేకాక గుర్తించిన స్థలంలో చెట్లను తొలగించి, చెత్త,చెదారాన్ని తీసివేసి చదును చేయించాలని తహసిల్దార్ ను ఆదేశించారు.

అలాగేవామనగుండ్ల పంచాయతీ కార్యదర్శి జయసుధను గ్రామంలో ఫీవర్ సర్వే వివరాలను,శానిటేషన్, ఎల్ఆర్ఎస్ ప్రక్రియలపై సమాచారం అడిగి తెలుసుకున్నారు.

దేశంలో అత్యంత రద్దీగా ఉండే జాతీయ రహదారుల్లో హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవే-65 ఒకటి.

తెలుగు రాష్ట్రాల మధ్య వారధిగా ఈ హైవే నిలుస్తోంది.ప్రమాదాల సంఖ్య కూడా అధికంగా ఉండడంతో కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్)లో భాగంగా ఏడీపీ అనే కంపెనీ ఈ ట్రామా కేర్ సెంటర్‌ను నిర్మించి ప్రభుత్వానికి అందజేయనుంది.

ఆ హీరోల కోసమే స్టోరీలు రాసుకున్న దర్శకులు.. వాళ్లు నో చెప్పడంతో..?