సరియైన పత్రాలు లేని 2 ట్రాక్టర్ ట్రైలర్స్, 1 మీడియం గూడ్స్ వెహికల్ లను సీజ్ చేసిన రవాణా శాఖ అధికారులు
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా: శనివారం నాడు వాహనాల తనిఖీల్లో భాగంగా తంగల్లపల్లి చౌరస్తా ప్రాంతం లో 2 ట్రాక్టర్ ట్రైలర్స్, 1 మీడియం గూడ్స్ వెహికల్ సరియైన పత్రాలు లేని కారణంగా వాటిని రవాణా శాఖ అధికారులు సీజ్ చేసి తంగల్లపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది.
ఈ విషయం లో ఆర్టిఏ అధికారులు మాట్లాడుతూ ఇసుక, ఇతర మెటీరియల్స్ రవాణా చేసే అన్ని వాహనాలు సరైన పత్రాలు తప్పని సరిగా కలిగి వుండాలి.
అర్హత కలిగిన డైవర్లను మాత్రమే ఉపయోగించాలి.లేని పక్షంలో అట్టి వాహనాలు మా తనిఖీల్లో పట్టుబడినచో వాటిని సీజ్ చేసి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని తెలియచేశారు.
ఈ తనిఖీల్లో కిషోర్ చంద్ర రెడ్డి, ఎంవిఐ సిబ్బంది పాల్గొనడం జరిగింది.
వైరల్: తొండంతో ఒకరిని లేపి విసిరి పారేసిన ఏనుగు, 24 మందికి పైగా తీవ్ర గాయాలు!