CM Jagan : అవినీతి లేకుండా పారదర్శకంగా పాలన..: సీఎం జగన్
TeluguStop.com
విశాఖపట్నంలో జరుగుతున్న ‘విజన్ విశాఖ’( Vision Visakha ) సదస్సులో సీఎం జగన్ పాల్గొన్నారు.
ఈ సదస్సులో రెండు వేల మందికి పైగా పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీఎం జగన్( CM Jagan ) మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత హైదరాబాద్ ను కోల్పోయామని తెలిపారు.
కీలక సంస్థలన్నీ హైదరాబాద్ లోనే ఉండిపోయాయన్నారు.వ్యవసాయ రంగానికి( Agriculture ) అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.
"""/" /
ఏపీలో 974 కిలోమీటర్ల తీరప్రాంతం ఉందన్న సీఎం జగన్ దేశంలోనే రెండో అతిపెద్ద తీరప్రాంతం ఉన్న రాష్ట్రం ఏపీనేనని తెలిపారు.
ఐదేళ్లలో చాలా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు.డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ ద్వారా లబ్ధిదారులకు నేరుగా నిధులు అందించామన్నారు.
అవినీతి లేకుండా పారదర్శకంగా పాలన అందిస్తున్నామని తెలిపారు.ప్రభుత్వ రంగంలో నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని వెల్లడించారు.
Fatboss : Sécurité Des Joueurs Et Jeu Responsable