పెళ్లి పీటలు ఎక్కిన ట్రాన్స్ జెండర్ హీరోయిన్.. ఎవరో తెలుసా?
TeluguStop.com
ట్రాన్స్ జెండర్లు.ముందుగా చాలామంది రోడ్డుపై, అలాగే షాపులో దగ్గర బలవంతంగా డబ్బులను తీసుకుంటూ ఉంటారని అనుకుంటూ ఉంటారు.
ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ పూర్తిగా డెవలప్ అవ్వడంతో ట్రాన్స్ జెండర్ లు కూడా అన్ని రంగాల్లో సత్తాను చాటుతున్నారు.
సినిమా,క్రీడా, రాజకీయం, బిజినెస్ అని తేడా లేకుండా ప్రతి ఒక్క రంగంలో రాణిస్తున్నారు.
ఇది ఇలా ఉంటే ట్రాన్స్ జెండర్లు రంగాల్లో సత్తాను నిరూపించుకోవడంతో పాటు నచ్చిన వారిని పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగు పెడుతున్నారు.
తాజాగా కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన ఒక ట్రాన్స్ జెండర్ ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకుంది.
"""/" /
థాయ్ లాండ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో ట్రాన్స్ జెండర్ పొయిడ్ ట్రిచాడ తన నటనతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే.
అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.36 ఏళ్ల ట్రిచాడ హీరోయిన్ గానే కాకుండా పలు యాడ్స్ లో నటిస్తూ మోడల్ గా కూడా రాణిస్తోంది.
తాజాగా పొయిడ్ ట్రిచాడ తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది.పుకెట్ ప్రావిన్స్ కి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త ఓక్ భవఘా హాంగ్యోక్ తో మార్చి 1న వివాహం ఎంతో ఘనంగా జరిగింది.
అయితే తాజాగా అదే విషయాన్నీ ప్రకటిస్తూ మేము అఫిషియల్ గా భార్యాభర్తలం అంటూ ట్రిచాడ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోటోలను పోస్ట్ చేసింది.
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. """/" /
ట్రిచాడ తన పదిహేడేళ్ల వయసులో ట్రాన్స్ జెండర్ ఆపరేషన్ చేయించుకొని పూర్తిగా అమ్మాయిగా మారిపోయింది.
మొదట అబ్బాయిగా జన్మించినప్పటికీ రాను రాను తనలో అమ్మాయి లక్షణాలు ఎక్కువగా కనిపించడంతో ఆ తర్వాత ఆమె ట్రాన్స్ జెండర్ గా మారిపోయింది.
ఇక తరువాత ఆమె మోడలింగ్ రంగంలో తన కెరీర్ ఆరంభించి అంచెలంచెలుగా పైకి వచ్చింది.
2004 లో ట్రాన్స్ జెండర్స్ కోసం నిర్వహించిన మిస్ టిఫ్పనీ పోటీలో విజేతగా కూడా గెలిచింది.
మహిళకు దీపావళి సర్‌ప్రైజ్.. ఇల్లు క్లీన్ చేస్తుండగా బయటపడ్డ నోట్లు.. కానీ..?