తెలంగాణలో ఐపీఎస్ ల బదిలీలు..!! హైదరాబాద్ సీపీగా శ్రీనివాస్ రెడ్డి

తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి.ఈ క్రమంలో హైదరాబాద్ నగరానికి కొత్త పోలీస్ బాస్ లు వచ్చారు.

మూడు కమిషనరేట్ల పరిధిలో అధికారులను బదిలీ చేస్తూ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు ఇచ్చారు.

ఈ మేరకు హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి నియామకం అయ్యారు.అలాగే సైబరాబాద్ సీపీగా అవినాష్ మహంతి, రాచకొండ సీపీగా సుధీర్ బాబు నియామకం కాగా తెలంగాణ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ గా సందీప్ శాండిల్య ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

మరోవైపు సైబరాబాద్ సీపీగా ఉన్న స్టీఫెన్ రవీంద్ర స్థానంలో అవినాశ్ మహంతిని నియమించారు.

ఈ నేపథ్యంలో డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని స్టీఫెన్ రవీంద్రకు, దేవేంద్ర సింగ్ చౌహాన్ కు ఆదేశాలు జారీ చేశారు.

అయితే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పోలీస్ అధికారుల పనితీరుపై డీజీపీ రవిగుప్తా, ఇంటెలిజెన్స్ ఏడీజీ శివధర్ రెడ్డిని నివేదిక కోరారని సమాచారం.

వేణు స్వామికి షాక్ ఇచ్చిన కోర్టు.. కేసు నమోదు చేయాలంటూ?