ఏపీలో ఐఏఎస్ అధికారుల బ‌దిలీలు

ఏపీలో ఐఏఎస్ అధికారుల బ‌దిలీలు జ‌రిగాయి.ఈ మేర‌కు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

దీనిలో భాగంగా సాంకేతిక విద్యాశాఖ డైరెక్టరుగా విధులు నిర్వ‌హిస్తున్న పొల భాస్క‌ర్ ను రిలీవ్ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.

ఈ క్రమంలో విద్యాశాఖ డైరెక్ట‌రుగా నాగ‌రాణి, జౌళి, చేనేత శాఖ క‌మిష‌న‌ర్ గా ఎం.

ఎం నాయ‌క్ లు నియ‌మితుల‌య్యారు.అదేవిధంగా ఎం.

ఎం నాయ‌క్ కు ఆప్కో సీఎండీ, ఖాదీ విలేజ్ బోర్డు సీఈఓగా అద‌న‌పు బాధ్య‌త‌లు అప్పగించారు.

బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి జ‌య‌ల‌క్ష్మీకి సాంఘీక సంక్షేమ ముఖ్య కార్య‌ద‌ర్శిగా అద‌న‌పు బాధ్య‌త‌లు అప్ప‌గించారు.

అదేవిధంగా పాఠ‌శాల‌ల్లో మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న కోసం ప్ర‌త్యేక అధికారిని నియ‌మించాల‌ని ఇటీవ‌ల సీఎం జ‌గ‌న్ ఆదేశాలు జారీ చేశారు.

ఈ మేర‌కు కొత్త పోస్టు ఏర్పాటు చేసిన ప్ర‌భుత్వం కాటంనేని భాస్క‌ర్ కు బాధ్య‌త‌లు అప్ప‌గించింది.

అలాగే మిష‌న్ క్లీన్ కృష్ణా-గోదావ‌రి కెనాల్స్ క‌మిష‌న‌ర్ గా అద‌న‌పు బాధ్య‌త‌ల్లో కాటంనేని కొన‌సాగే విధంగా ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.