Nirmal District : నిర్మల్ జిల్లా భైంసా విద్యుత్ ఏఈపై బదిలీ వేటు
TeluguStop.com
నిర్మల్ జిల్లా( Nirmal District ) భైంసా విద్యుత్ ఏఈ రాంబాబుపై( AE Rambabu ) బదిలీ వేటు పడింది.
ఈ మేరకు ఏఈ రాంబాబును నిర్మల్ కు బదిలీ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని భైంసా సబ్ స్టేషన్( Bhainsa Sub-station ) ముందు ఈ నెల 20వ తేదీన రైతులు ధర్నా( Farmers Protest ) చేసిన సంగతి తెలిసిందే.
"""/" /
ఈ క్రమంలో సబ్ స్టేషన్ సిబ్బందిని కోతల విషయంపై నిలదీస్తే నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని రైతులు ఆరోపించారు.
ఈ క్రమంలోనే విద్యుత్ ఏఈ రాంబాబుపై బదిలీ వేటు పడినట్లు తెలుస్తోంది.
లండన్: ఇదేం ఖర్మరా బాబు.. లక్ష అద్దె కట్టినా చిల్లుల కొంపే.. భారతీయుడి ఆవేదన!